నిత్యుండనై హిరణ్యకుండ నై శివరూపుడనై యున్నాను.
హస్త పాదములు లేకుండానే నిరవధిక శక్తి పరిపూర్ణుడనై
నేత్ర రహితుడనయి సమస్తమును చూచుచు,
కర్ణములు లెకుండానే సర్వమున్బు వింటూ నాకాశ
స్వరూపుడనై చిత్స్వ రూపుడనై సమస్తమును తెలుసుకొందును.
కాని ఇట్టి నన్ను గుర్తించు వారొక్కరును లేరు.
వేదై రవే షై రహమేవ వేద్యో
వేదాంత క్రుద్వేద విదేవ చాహమ్,
న పుణ్య పాపే మయి నాస్తి నాశో
న జన్మ దేహేంద్రి య బుద్ధ యశ్చ 57
న భూమిరాపో న చ వ హ్నిరస్తి
న చానిలో మేస్తి న మే నభశ్చ
ఏవం విదిత్వా పరమాత్మ రూపం
గుహాశయం నిష్కల మద్వితీయమ్ 58
సమస్త సాక్షిం సద సద్విహీనం
ప్రయాతి శుద్ధం పరమాత్మ రూపమ్,
ఏవం మాం తత్త్వతో వేత్తి - యస్తు రామ మహీపతే !
స ఏవ నాన్యో లోకేషు - కైవల్య పల మశ్నుతే 59
ఇతి శ్రీపద్మ పురానే శివగీతాయాం షష్టోధ్యాయః
సమస్త వేదములద్వారా తెలిసికొనదగిన వాడిని నేనే.
వేదాంతములను రచించిన వాడిని, వేదములను గుర్తించిన వాడిని,
పుణ్యపాపముల కతీతుడను, నా కంతమనునది లేనేలేదు.
(నాశనము లేదు) జనన దేహేంద్రి యములు బుద్ధి శూన్యములు,
మరియు నాకు పృథ్వీ అప్పు - తేజ - ఆకాశము - వాయువు
అనే పంచతత్వముల కతీతుడను, ఈ ప్రకారముగా నెవ్వడైతే
పరమాత్మను ఒక్కనిగాను సమస్త సాక్షిగాను, శుద్ధ స్వరూపునిగాను,
సద సద్విహీనునిగాను, హృదయ స్థితుడనైన నన్ను
తెలిసికొందురో వారే కైవల్యమును పొందుదురు, ఇతరులు పొందలేరు.
ఇది వ్యాసోక్త సంస్కృత పద్మ పురాణంతర్గతం బైన
శివ గీతలో ఆరవ అధ్యాయము సమాప్తము.
No comments:
Post a Comment