Wednesday, January 8, 2014

పంచాంగ విషయాలు 1




 
వర్జ్యం : ' వర్జింపుట ' అనగా వదలివేయుట అని అర్ధము.
 ప్రతి దినము కాలెండరు నందు చెప్పబడు రాహుకాల,
 దుర్ముహూర్త వర్జ్యాదులలో ఏ కార్యము తల పెట్టినను
అది సంపూర్ణ ఫల మందించదు.
 కావున అట్టి సమయములలో ఏ శుభ కార్యమును
ప్రారంబించరాదని ఆర్యుల అభిప్రాయము.
మన ఆంధ్ర రాష్ట్రములో ఎక్కువగ పాడిలో నున్నది .
వర్జ్యము ( దక్షినాది రాష్ట్రాల వారు రాహు కాలము,
యమగండము వంటివి పాటించెదరు ).
 ప్రతి శని వారము సూర్యోదయంతో ప్రారంబమగునది దుర్ముహూర్తం .
సూర్యోదయంతో మొదలయ్యే 5  ఘడియలు అనగా  1 గం . 40 ని .
పాటు ఈ దుర్ముహూర్తముండును.
 కాన ఆ సమయమందును  ఏ శుభ కార్యము తల పెట్ట రాదు.
 రాహు కాల యమగండ కాలములు నిత్యము నిర్దిష్ట సమయములలో ఉండును.
 అవి చూచుకొని ఆయా సమయములలో కాక మిగిలిన శుభ ఘడియలలో
కార్యములు తల పెట్టిన అవి నిర్విఘ్నముగా  నెరవేరును.
ఏలినాటి శని : ప్రతి మానవుని జీవిత కాలమందు ముప్పది
 ఏండ్ల కోక మారు ఏలినాటి శని ప్రవేశించును.
జన్మ రాశికి - నామ రాశికి - ద్వాదశమునందు - లగ్నము నందు ,
ద్వితీయము నందు - శని యున్నచో ఎల్నాటి శని యందురు.
శని గ్రహము ఒక్కొక్క రాశి యందు 2 1/2 సంవత్సరముల
 కాలము సంచారము -మొత్తము కలిపి ఏడున్నర సంవత్సర
 కాలము ఎల్నాటి శనియున్నదన్నమాట .
ఫలితము: ద్వాదశ  రాశి యందున్నప్పుడు  -ధన వ్యయము ,
మానసిక భాద , అందోళనములు , కుటుంబ సమస్యలు,
వ్యాపార, వృత్తులందు వ్యతిరేకములు కలుగును.
జన్మరాశి యందున్నప్పుడు - బంధు మిత్ర ద్వేషములు,
 ధన నష్టము - కుటుంబ స్థితి తారుమారుగా ఉండును.
కొన్ని శుభ గ్రహ వీక్షణచే ప్తయత్న పూర్వక ధనాదాయము ,
మిశ్రమ ఫలితములు ఉండవచ్చును. కళత్ర పీడ, మతి బ్రమణం,
 దీర్ఘ వ్యాదులు కలుగ వచ్చును .
ద్వితీయము నందున్నప్పుడు - ఆశా జీవి యగును .
నిందలు పడుట, నిత్య దు : ఖము కలుగును.
మానసికముగా క్రుంగదీయును .పై కాలములందు మాస
శివ రాత్రి రోజున శని పూజలు చేయుట మంచిది.
సం    నె    రో
ముఖము నందు         0  3  10 శరీర పీడ - ధన నష్టాదులు
దక్షిణ భుజము           1  1   00 ఉద్యోగ వృత్తులందు లాభాదులు
పాదములందు            1  8  10  అశాంతి - దిగులు - అవమానములు
హృదయస్థానము        1  4  20  ధన ప్రాప్తి - గౌరవము - కీర్తి
వామ భుజము           1  1  10  వ్యాధి పీడ - ధన వ్యయము

No comments:

Post a Comment