సండే -రవివార్ ;
మన్ డే - సోమవార్ ;
ట్యూజ్ డే - మంగళవార్ ;
వెన్స్ డే - బుధవార్ ;
తర్స్ డే -బృహస్పతి వార్ ;
ఫ్రై డే - శుక్రవార్ ;
సాటర్ డే - శనివార్.
నక్షత్రములు : నక్షత్రములు 27 .అవి
1 .అశ్వని 2 .భరణి 3 .కృత్తిక 4 .రోహిణి 5 .మృగశిర
6 .ఆర్ద్ర 7 .పునర్వసు 8 .పుష్యమి 9 .ఆశ్లేష 10 .మఖ
11 . పుబ్బ 12 .ఉత్తర 13 .హస్త 14 .చిత్త 15 .స్వాతి
16 .విశాఖ 17 .అనూరాధ 18 .జ్యేష్ఠ 19 .మూల
20 .పూర్వాషాడ 21 .ఉత్తరాషాడ 22 .శ్రవణము
23 .ధనిష్ఠ 24 .శతబిషము 25 .పూర్వాభాద్ర
26 .ఉత్తరాభాద్ర 27 .రేవతి .
యోగములు : యోగములు 27 .అవి .
1 .విష్కంభము 2 .ప్రీతి 3 .ఆయుష్మాన్ 4 .సౌభాగ్యము
5 .శోభనము 6 .అతిగండము 7 .సుకర్మము 8 .ధృతి
9 .శూలము 10 .గండము 11 .వృద్ధి 12 .ద్రువము
13 .వ్యాఘాతము 14 .హర్షణము 15 .వజ్రము 16 .సిద్ధి
17 .వ్యతీపాతము 18 .వరీయాన్ 19 .పరిఘము
20 .శివము 21 .సిద్దము 22 .సాధ్యము 23 .శుభము
24 .శుక్లము 25 .బ్రాహ్మము 26 .ఇంద్రము 27 .వైధృతి .
కరణములు: కరణములు 11 .అవి 1 .బవ 2 .బాలవ
3 .కౌలవ 4 .తైతుల 5 .గరజ 6 .వనజ 7 .భద్ర 8 .శకుని
9 .చతుష్పాతు 10 .నాగవము 11 .కిం స్తుఘ్నము
మానములు - మాసములు : సౌర మానము –
సూర్య గమనము ప్రధానముగా కలది.
చాంద్ర మానము - చంద్ర గమనము ప్రధానముగా కలది.
'స్వస్తిశ్రీ చాంద్రమానేన ..............'అను విధముగా మనము చెప్పుట గాని,
వ్రాయుట గాని జరుగు చుండును.
అనగా మనము చాన్ద్రమానమునే అనుసరించు
చుందుమని గ్రహింపవలెను.
చంద్రుడు రోజున కొక్క నక్షత్రమునందు సంచరించు చుండును.
అదే మనకు నిత్య నక్షత్రముగా గ్రహింపవలెను. పూర్ణిమ
నాడు ఉండు నక్షత్రమును బట్టి ఆయా మాసములకు
ఆయా పేర్లు వచ్చినవి.
No comments:
Post a Comment