Thursday, January 30, 2014

శ్రీశైల స్ధల పురాణము SriSailastalapuranam2




ఇది గాక దక్షుడిచ్చటి సంగ మేశ్వర తీర్ధ మున దక్ష యాగా మొనర్చినాడు. సతీ దేవి యీ సంగ మేశ్వర మున నే తాను తండ్రి పై అలిగి శివాపరాధియగు నాత ని వలన దన శరీరము నొల్లక తచ్చిరీర నివృత్తి ఇట ఒనర్చినది. కనుక నే యిది "నివృత్తి సంగ మేశ్వర "మైనది. సప్త సింధు సంగమమిది. దక్ష యాగ విద్వంస మిటనే జరిగినది. బ్రహ్మచే ప్రా ర్ధి తుడై యీశ్వరుడి తీర్ధ మున సర్వకళా సంపూ ర్ణుడై' సంగ మేశ్వరుడు ' గా న వతరించినాడు. గ్రహణాదుల యందిట సప్తసాగర సంగమము సర్వనదీ సంగమము గూడ గలుగును. అట్టి పుణ్య కాలమున నిందు స్నానము చేయగలిగినవాడు ధన్యాత్ముడు. ధీ ని మహిమ అనంత ము. ఈ తిర్ద మును గూర్చి ఈ శ్రీశైల ఖండము వేనోళ్ళ చాటి చెప్పుచున్నది. ఏ తిర్ద మును గూర్చియు ఇంత విపులముగా నిది చెప్పలేదనవచ్చును. ఇది గాక, పరమేశ్వరుడు ప్రళయమైన తరువాత తాను గొన్ని నాళ్ళ ఇచ్చుట విశ్రాంతిగొని తానిచ్చటి నుండి యే దేవతల సృష్టిoచినాడు. అది యే 'దేవ హ్రదము'. ఇది భారతాదులయందు గూడా దివ్యతీర్ధ ముగా చెప్పబడి నది. కనుక ని కల్పమునందలి సృష్టి ప్రారంభ మగు నాటికే యిది వెలసియున్నదన వచ్చును. త్రిపుర సంహారము నాడుగూడ నీ శ్రీశైలమున్నది. ఇందు లింగాగ మవృత్తాంత ప్రసంగమున త్రిపురాసురులచే నారాధ త ముగు మహాలింగము పరమేశ్వర బాణమును విదళిత మై కోటాన గోట్లు లింగ ములుగా ఇటకు వచ్చి పడినదని శ్రీశైలఖిండ ము వర్ణంచుచున్నది. త్రిపురాస్త కమున త్రిపుర సంహార ము జరగలేదు. ఇది స్ధలాంతర మున జరిగినట్లు శ్రీ శైల ఖ౦డ ము వచించుచున్నది. ఈ సందర్భమున అష్టాదశ మహాపురాణములలో నోకటియగు పద్మ పురాణము' జలేశ్వరతీర్ధ మును' ను గుఱించి చెప్పచు త్రిపుర సంహార మును, నర్మద దరిని మాహేశ్వర క్షేత్రమునుండి శివుడు జరిపినట్లు వర్ణంచినది. త్రిపురములలో ఒక పుర ము ద హింపపడుచు వచ్చి శ్రీ శైలమున బడినట్లు గూడ నిందు గలదు. అట బడిన జ్వాల యొకటి పైకెగ య దానిని మహేశ్వరుడు స్తంభింపజేసి లో కరక్షేణ మొ న ర్చె న ని కూడ నిది వచించినది. ఆ పడిన చోటు 'జ్వాలేశ్వర' మును తీర్ధ పర్యముగా గూడ నైనది.'జ్వాలలతో డ పురంబులు, కూలిపడిన చోటు రుద్ర కో టులచే తన్| క్రాలుట యె కాక క్రలెను. జ్వాలేశ్వర మనెడి తీర్ధ వర్యంబగుచున్' (పద్మ. అది ఖిండ ము. 241 ప.) ఈ పడిన చొటే 'త్రిపురాంతక' మగును.

First    1 2 3 4 5 6 7 8 9 10 11 Last

No comments:

Post a Comment