దీనిలో తూర్పున కిరాతులు, పశ్చిమమున యవనులునుందురు.
మధ్యభాగమున బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాది వర్ణములవారు
నివసింతురు. వేదములు, ధర్మ శాస్త్రములు, ఇతర శాస్త్రములును ఇక్కడ వృద్ధిపొంది
వ్యాపించును. మరియు ఇచ్చట గంగ, యమునా, సరస్వతి, సింధు, గోదావరి, నర్మదా, కృష్ణవేణి, కావేరి, కృతమాల, తామ్రపర్ణి మున్నగు నదులు ఉపనడులతో గలిసి
ప్రవహించుచు సాగరములోనికి చేరుచుండును. తూర్పుదేశ నివాసులును, కామరూపదేశస్థులును, పౌండ్ర, కళింగ, మగధ, దాక్షిణాత్యులును, సౌవీర, సైందవాది దేశవాసులును, మద్ర, ఆరామ, అంబష్ట, పారశీక నివాసులను, ఈ మహానదుల జలములను త్రాగుచు, వీనివలన కలుగు పాడిపంటలతో సంపన్నులగుచు సంతోషముగా కాలము
గడుపుచుందురు.
భారత వర్ష ప్రశస్తి
ఈ భారత వర్షముననే, కృత త్రేతా ద్వాపర కలియుగములను
నాలుగు యుగములు నడుచును. ఇక్కడి వారిలో కొందరు సన్యాసులై
తపము చేసికొందురు. కొందరు యజ్ఞయాగాదులతో దేవతలకు సంతృప్తి కలిగింతురు.
కొందరు పరలోఖ సుఖములకై దానధర్మములు చేయుదురు. పరలోకములకు జేరినవారి ఉత్తమగతులకై
కూడా దానధర్మములు చేయుదురు. యాచకులై వారికి లేదనుకుండా దానములు
చేయుదురు. వేదములు చదువుదురు. వానిని శిష్యులకు పాటములు జెప్పుదురు. చెరువులు
త్రవ్వించుట , గుళ్ళు గోపురములు గట్టించుట, బావులు త్రవ్వించుట మున్నగు
లోకోపకారములగు ధర్మకార్యములు చేయుచుందురు.
ఇటువంటివి అన్నియు ఇతర వర్షములలో
జరుగవు. అక్కడ నండువారికి ఆచరణీయములగు సిద్ధులు వేరే ఉన్నవి. వానికిని వీనికిని
సంబంధము లేదు.
జంబూద్వీపాములో, కొన్నివేల జన్మలలో చేసిన
పుణ్యములకు ఫలముగా మానవజన్మ దొరకును. భారత ఖండవాసులు చాల ధర్మాత్ములనియు, స్వర్గ మోక్షములకు కారణమైన
కర్మలాచరింపదగిన జన్మమెత్తిన వారనియు వీరిని
దేవతలే అభినందింతురు. ఈ కర్మభూమిని మించినది మరొకటి లేదని చెప్పుచుందురు.
ప్లక్షాది ద్వీపములు
ప్లక్షద్వీపము గూడా జంబూద్వీపము వలెనే
ఉప్పుసముద్రము చేత ఆవరింపబడి యుండును. జంబూద్వీపము కంటే రెట్టింపు వైశాల్యము (రెండు
లక్షల చ|| యోజనములు) కలిగియుండును. దీనికి మొదటి రాజు మేదాతిది, అతనికి, శాంతమయుడు, శాశిరుడు, సుఖోదయుడు, ఆనందుడు, శివుడు, క్షేమకుడు, ధ్రువుడు, అను నేడుగురు కొడుకు లుండిరి.
వీరి పేరుమీదనే ఇక్కడ ఏడు వర్షములు ఏర్పడెను. (వర్షము = దేశవిభాగము) ఇచట
గోమేద, చంద్ర, నారద, దుందుభి, సోమక, సుమనస్, వైభ్రాజములను కుల పర్వతములు గలవు.
No comments:
Post a Comment