ఈ అనంత మైన
విశ్వములో మనము నివసించుచున్న
భూమి ఒక గుండ్రని
గోళము .
అటువంటి గోళములు
విశ్వములో లేక్కలేనన్నివి ఉన్నవి.
మనకు పెద్దవిగా కనపడి
ఎక్కువగా చలనము
ఉన్నవాటిని గ్రహములని,
చిన్నవాటిని
నక్షత్రములని అను చున్నాము.
ఈ గ్రహములు
ముఖ్యముగా తొమ్మిది .
సూర్యుడు ,చంద్రుడు, అంగారకుడు, బుధుడు,
గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతువు.
సూర్యుడు ప్రదాన గోళముగా ఈ గోళములన్నియు
సూర్యుని చుట్టూ తిరుగు చున్నవి.
వీనిలో కొన్ని ఒక దాని చుట్టూ
మరియొకటి తిరుగును.
ఒక దానికొకటి ఆకర్షించు కొనుచున్నవి.
ఉదా : భూమి తన చుట్టూ
తాను తిరుగుచూ,
సూర్యుని చుట్టూ గూడ తిరుగుచున్నది .
చంద్రుడు భూమి చుట్టూ తిరుగు చున్నాడు.
భూమి తన చుట్టూ తాను
తిరుగుట వలన సూర్యుని
వెలుతురు ఒక భూ భాగము నుండి
మరియొక భూ భాగమునకు మారుటచే రాత్రి ,
పగలు ఏర్పడుచున్నవి.
భూమి తన చుట్టూ తాను
ఒకసారి తిరుగుటను ఒక రోజు అనియు,
చంద్రుడు
భూమి చుట్టూ ఒక ప్రదక్షిణము చేయుటను ఒక నెల అనియు,
భూమి
సూర్యుని చుట్టూ ఒక
ప్రదక్షిణము చేయుటను
ఒక సంవత్సరమనియు
ప్రపంచములోని అన్ని
దేశములవారు
లెక్కించు చున్నారు.
గ్రహములు సంచరించుచున్న మార్గమును మన
పూర్వీకులు జ్యోతిశ్చక్రముగా ఊహ చేసి , దానిని 12 భాగములు
(రాశులు) గా భాగించినారు.
ఒక్కొక్క భాగములో
నున్న నక్షత్రముల రాశులకు ఒక్కొక్క పేరు పెట్టినారు.
నక్షత్రములు మొత్తము 27 . ఒక్కొక్క
నక్షత్రమునకు
4 భాగములు (పాదములు)
ఊహించి అటువంటి
నక్షత్ర భాగములను 9 ని ఒక రాశిగా నిర్దారించినారు.
వాని రూపములను ఊహించి ఆ ప్రకారము రకరకముల పేర్లు పెట్టినారు.
ఒక్కొక్క నక్షత్రమునకు 4 భాగముల
వంతున
27 నక్షత్రములకు 108 భాగములకు 12 రాశులు
అయినవి.
చంద్రుడు భూమి చుట్టూ
తిరుగుటవలన మనకు రోజుకొక
నక్షత్ర
మండలము నుండి కనపడుచున్నాడు.
ఏ నక్షత్ర మండలములో
చంద్రుడు మనకు కనపడుచున్నాడో
ఆ నక్షత్రమును
మన పంచాంగపు వ్యవహారములలో
ఆనాటి నక్షత్రముగా పరిగణించుచున్నాము
.
పౌర్ణమి నాడు చంద్రుడు ఏ నక్షత్ర మండలములో కనపడునో
ఆ నక్షత్రము పేరు ఆ నెలగా వాడు చున్నాము .
చిత్తా నక్షత్ర మండలములో
చంద్రుడు పౌర్ణమి
నాడు కనపడు
మాసమునకు చైత్రమాసము
అని పేరు పెట్టబడినది.
ఈ ప్రకారము
విశాఖ- వైశాఖ, జ్యేష్ట - జ్యేష్టము,
పూర్వాషాడ
- ఆషాడము ,శ్రవణము - శ్రావణము ,
ఉత్తరాబాద్ర - భాద్రపదము , అశ్వని -
ఆశ్వయుజము ,
కృత్తిక - కార్తీకము , మృగశిర -
మార్గశిరము, పుష్యమి
- పుష్యము, మఖ -మాఘము, ఉత్తర ఫల్గుణి –
ఫాల్గుణము అని మనము ఆ నెలలను పిలుచు చున్నాము.
పై అన్ని విషయములను గూర్చి తెలుపునది పంచాంగము.
పై అన్ని విషయములను గూర్చి తెలుపునది పంచాంగము.
పంచాంగము ముఖ్యముగా
మనకు 5 విషయములను తెలుపును.
1 తిది , 2 వారము, 3 నక్షత్రము, 4 యోగము, 5 కరణము.
No comments:
Post a Comment