Wednesday, January 8, 2014

శివ గీత31




శ్రీరాముడు ప్రశ్నించు చున్నాడు :-
ప్రభూ ! ఓ మహాదేవా! మీరిప్పుడు చెప్పిన విషయమునందు
 గొప్ప విభ్రాంతి కలుగుచున్నది. నీవు స్వచ్చమైన స్పటిక
మణి మాదిరిగా తెల్లనైన వాడు, పరిభిన్న స్వరూపుడవు.
ఉమాదేవితో కూడి ప్రమదులతో నిక్కడ విరాజిల్లు చున్నావు.
 పంచ భూతాత్మక మగున ప్రపంచము నెట్లు సృష్టించితివి?
నాకు విస్తారముగా తెలియ పరచి నన్ననుగ్రహింపుము.

శృణు రామ! మహాభాగ - దుర్జేయ మమరైరపి,
తత్ప్ర వక్ష్యామి యత్నేన - బ్రహ్మ చర్యేణ సువ్రత 4
పారం యాస్య స్య నాయాసా - ద్యేన సంసార నీరదే:,
దృశ్యంతే యాని చాన్యాని - స్థావ రాణి చరాణి చ . 6
గంధర్వా: ప్రమధా నాగా - స్సర్వేతే మద్వి భూతాయః ,
పురా బ్రహ్మాద యో దేవా - ద్రష్టు కామా మమా కృతిమ్ 7
ఓయీ రామా! బహు ముఖ్యమైన విషయమునే ఆలోచించి ప్రశ్నించితివి.
ఇది దేవతలకు కూడా తెలియదు. కావున అట్టి గోప్యమైన
విషయమును నీకు వివరించెదను. అవధరింపుము.
ఈ కన్నుల కగు పడుచున్నట్టి (దృగ్గో చరమగునట్టి ) పంచ భూతములు,
 పదునాలుగు భువనములు, సప్త సముద్రములు ,
 సప్త పర్వతములు, ముక్కోటి దేవతలు, దానవులు,
మరియు నీ చరా చరాత్మకము లైన జీవ రాసులు, గంధర్వులు,
 ప్రమధులు , సర్పములు మొదలగున వన్నియు నా
యంశ భూతములే, మొట్ట మొదట బ్రహ్మాది దేవతలు
నా నిజ స్వరూపమున కనుగొన నిష్ఠ పడిన వారై నాకెంతగానో
 ఇష్టమైన మందార పర్వతమున కరగిరి.

మందరం ప్రయయు స్సర్వే - మమ ప్రియతరం గిరిమ్,
స్తుత్వా ప్రాంజల యో దేవా - మాం తదా పురత స్థ్సితాః 8
తాన్ద్రుష్ట్వాద మయా దేవాన్ - లీలా కులిత చేతసః,
తేషామ పహృతం జ్ఞానం - బ్రహ్మాదీనాం ది వౌకసామ్ 9
అసంస్తే సకృద జ్ఞానా - మామాహు: కో భవానితి,
అధా బ్రువ మహం దేవా - బ్రహ మేవ పురాతనః 10
ఆటకు వెళ్ళిన వారై బద్దాంజలు లై నన్ను గురించి స్తోత్రము చేయుచు,
 నా పర్వతము చేరువలో నిలిచిరి. అట్టి వారినే కనుగొని
 లీలామాత్రమైన చిత్తముతో నేను బ్రహ్మాది దేవతల యొక్క
ఇంగిత జ్ఞానము నపహరించితిని .
అప్పుడు వారు అజ్ఞానముతో నన్ను " నీ వెవ్వడవని " ప్రశ్నించితిరి.
 ఆ సందర్భమున నేను ఆ దేవతలతో " ఓయీ దేవతలారా!
నేనే అనాది పురుషుడిని.


First  30 31 32 33 34 35 36 37 38 39  40 41   Last

No comments:

Post a Comment