Wednesday, January 8, 2014

పంచాంగ విషయాలు 3




ఋతువులు: రెండు నెలలకు ఒక ఋతువుగా వాటి దినములలో
కాల ధర్మములను బట్టి ఋతువు అని పిలుచు చున్నాము .
 సంవత్సరములోని 12  నెలలు 6 ఋతువులుగా
 నిర్ణయించబడినవి .
భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ,
సూర్యుని చుట్టూ తిరిగే సంవత్సర కాలములో సగ కాలము
సూర్యునికి దగ్గరగాను, మిగతా సగ కాలం దక్షినమునకు,
 దక్షిణము నుండి ఉత్తరమునకు ప్రయాణము
 చేయుచున్నట్లు కనపడును.
సూర్యుడు ఉత్తరము దిక్కుగా ప్రయాణము చేయుచున్నట్లు
 కనపడు కాలమునకు ఉత్తరాయనము ,
దక్షిణపు దిక్కుగా ప్రయాణము చేయు కాలమును
 దక్షిణాయనము
అందురు.
శకములు: సంవత్సర  లెక్కల కోసం ఈ శకములు ప్రారంభ మైనవి.
పూర్వం నుండి మన దేశంలో అనేక శకములు వాడుకలో ఉండెను .
వాటిలో ముఖ్యమైనవి 1 .శాలివాహన శకము  2 . విక్రమార్క శకము .
 శాలివాహన శకము దక్షిణ దేశంలోనూ, విక్రమార్క శకము
ఉత్తర దేశంలోనూ వాడుకలో ఉన్నవి.
మనకు స్వాతంత్ర్యము వచ్చిన తరువాత మన భారత ప్రభుత్వము
 ఇటువంటి వేరు వేరు శకములుండ రాదని, దేశమునకు మొత్తము
 ఒకే జాతీయ శకము ఉండవలెనని, శాలివాహన శకమును
 జాతీయ శకముగా
నిర్ణయించారు .
యుగములు: యుగములు నాలుగు . 1 .
కృత యుగము  2 . త్రేతా యుగము  
3 . ద్వాపరయుగము  4 . కలియుగము .
కృతయుగము --   17 , 28 ,000 సంవత్సరములు
త్రేతాయుగము -    12 , 96 ,000 సంవత్సరములు
ద్వాపరయుగము -   8 ,64 ,000 సంవత్సరములు
కలియుగము  --       4 ,32 ,000 సంవత్సరములు
నాలుగు యుగములకు కలిపి మొత్తము
 43 , 20 , 000 సంవత్సరములు అగును .
 దీనినే ఒక మహా యుగము అందురు.
తెలుగు సంవత్సరములు : మన  తెలుగు సంవత్సరములు 60 .
అవి క్రీ . శ . 1987 - 88  నుండి 2047 - 48 వరకు ఈ క్రింద నీయబడినవి.
1 . ప్రభవ (1987 - 88 )    2 . విభవ (88 -89 )     
     3 . శుక్ల ( 89 -90 )  4 . ప్రమోదూత (90 -91 )
5 ప్రజోత్పత్తి (91 - 92 )
6 . అంగీరస (92 -93 )      7 . శ్రీముఖ (93 -94 )    
    8 . భవ (94 - 95 )  9 . యువ  ( 95  - 96 )  
 10 .దాత  (96 - 97 )
11 .ఈశ్వర ( 97 -98 )  12 . బహుధాన్య (98 -99 )
13 . ప్రమోది (99 -2000 ) 14 విక్రమ (2000 -2001 )
 15 వృష (01 -02 )
16 .చిత్రభాను ( 02 -03 ) 17 .స్వభాను (03 -04 )
18 . తారణ  (04 -05 )       19 . (పార్ధివ (05 - 06 )  
20 . వ్యయ (06 -07 )

No comments:

Post a Comment