నివాసయామి గృహ్ణామి - తస్మాదేకో హమీశ్వరః 39
న ద్వీతి యో యత స్త స్థే - తురీయం బ్రహ్మయత్స్వయమ్
భూతాన్యాత్మని సంహృత్య చైకో - రుద్రో వసామ్య హమ్ 40
నా భక్తులను గర్భ - జన్మ - జరా – మృత్యుమయమగు
నీ సంసార సాగరము నుండి దరింపజేయువాడిని కావున నన్ను
తారకుదని యందురు.
నాలుగు రకాల దేహములందును జీవత్వరూపమున
సూక్ష్ముండనై యుండుట వలన సూక్ష్మరూపుడను,
ఘోరాందఃకారము
(అజ్ఞానము) న మునిగియున్న భక్తులకు విద్యుత్తువలె భాసుర
రూపమును జూపుట చేత వైద్యుతాభిఖ్యుడను వాడను నేనే.
ఏ కారణము వలన నేనొక్కడి నే సర్వలోకములను సృష్టించెదనో,
వదలెదనో, జీవింపచేసెదనో మరల గ్రహించెదనో ఆ కారణముచేత
నేనొక్కడినే ఈశ్వరుడిని, త్రిమూర్తుల నధికమించి
నాకు సమానమైన వాడు వేరొకడు లేకపోవుట
వలన సమస్త ప్రాణులను నా హృదంతరాళము నందే సంహరింతును,
కనుక నేనొక్కడినే రుద్రుండనై యున్నాను.
సర్వలోకాన్య దీశేహ - మిశినీ భి శ్చ శక్తిభి:
ఈశాన మస్య జగత - స్స్వర్ధ్రుశం చక్షు రైశ్వరమ్ 41
ఈశాన మింద్రత స్థుష - స్సర్వే షామపి సర్వదా,
ఈశాన స్సర్వ విద్యానాం - యదీశాన స్త ద స్మ్యహమ్ 42
సర్వాన్భా వా న్నిరీ క్షేహ - మాత్మ జ్ఞానం నిరీక్షయే
యోగంచ సమయే యస్మా - ద్భ గవా న్మ హతో మతః 43
అజస్రం యచ్చ గృహ్ణామి - విసృజామి సృజామిచ,
సర్వాన్ లో కాన్యా సయామి - తేనాహం వై మహేశ్వరః 44
మహాత్స్వాత్మ జ్ఞాన యోగై - రైశ్వ ర్యై స్తు మహీయతే
సర్వన్భా వాన్మ హాదేవ - స్సృజత్యవతి సో స్మ్యహమ్ 45
నేను ఈ నీ శక్తులతో బాటు ఈ ప్రపంచమును
సర్వాంతర్గతుండనై తెలసి ఈ జగత్తునకు తెలిసికొను సాధన
వస్తువుగా నుండుట వలన జగనేత్రము కూడా నేనే అయి ఉన్నాను.
సర్వప్రాణి కిని సమస్త విద్యలకును స్వామిని నేనే
యగుట వలన ఈశానుడను నేనే .
అఖిల భావములను ఆత్మజ్ఞానమును,
సమయమును యోగంబును చూచుటవలన నేనే భగవంతుడిని,
సదా సమస్త లోకంబులను గ్రహించువాడను, త్యజించువాడను,
No comments:
Post a Comment