సోమ, బుధ, గురు, శుక్ర, శుభ వారములు.
వివాహము
శుభనక్షత్రములు: రోహిణి , మృగశిర ,మఘ, ఉత్తర, హస్త, స్వాతి,
అనూరాధ, మూల, ఉత్తరాషాడ , ఉత్తరాభాద్ర, రేవతి,
సప్తమశుద్ధి , శుభలగ్నములు. బుధ,గురు,
శుక్ర వారములు, 2 ,3 , 5 ,7 ,10 ,11 ,12 ,13 తిధులు .
నిషేకము లేక గర్భాదానము
శుభ నక్షత్రములు : శ్రవణము ,రోహిణి ,అనూరాధ,స్వాతి,రేవతి,
మూల ,ఉత్తర, ఉత్తరాషాడ, ఉత్తరాభాద్ర, శతబిషము, ఇవి మిక్కిలి శ్రేష్టము.
పుష్యమి, ధనిష్ఠ ,మృగశిర, అశ్వని ,చిత్త,పునర్వసు, ఇవి మధ్యరకము .
తిధులు : 2 , 3 ,5 ,10 సోమ ,బుధ, గురువారములు.
సంధ్యా పర్వత ప్రదోవ్రత శ్రాద్ధ రోజులు కూడదు.
సీమంతము
శుభమాసములు: 4 ,6 ,8 నెలలు
శుభ నక్షత్రములు: అశ్వని ,రోహిణి, మృగశిర, పునర్వసు,
పుష్యమి, ఉత్తర , హస్త, చిత్త, స్వాతి, అనూరాధ,మూల, ఉత్తరాషాడ ,
శ్రవణము, ధనిష్ఠ, శతబిషము, ఉత్తరాబాద్ర, రేవతి ,
నవమశుద్ది 2 ,3 ,5 ,7 ,10 ,11 ,13 ,15 తిధులు ,
ఆది, మంగళ ,బుధ, గురు, శుక్ర వారములు మంచివి.
శుభ కార్యములకు మంచి రోజులు
గృహ ప్రారంభము
శుభమాసములు : వైశాఖము ,శ్రావణము, మార్గశిరము,
పుష్యము, పాల్గుణములు చాలా మంచివి. చైత్రము,
కార్తీకము,మాఘము,నెలలు మధ్యరకము
శుభనక్షత్రములు: అశ్విని, రోహిణి,మృగశిర, పునర్వసు, పుష్యమి,
ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, అనూరాధ,ఉత్తరాషాడ,శ్రవణము,
ధనిష్ఠ, శతబిషము,ఉత్తరాభాద్ర,రేవతి,మధ్యాహ్నమునకు
పూర్వము చతుర్ద శుద్ధి కలిగి యుండవలయును.
దశమ శుద్ధి పూర్వాహ్దం (స్త్రీలకు అష్టమ శుద్ధి కూడ)
ఆది, సోమ, బుధ, గురు,శుక్ర వారములు.
శుభవారములు : సోమ ,బుధ, గురు, శుక్రవారములు.
No comments:
Post a Comment