8. అష్టముఖము : వినాయక స్వరూపము గురుభార్యా సంగమాది దోషములను పరి హరించి, విఘ్నములు హరించి, కార్యములందు జయము కలిగించి, పరమ పదమును జేర్చును.
9. నవముఖము : భైర వాత్మకము. ఎడమ భుజమున ధరించినచో రుద్రునివంటి బలమును, బ్రహ్మహత్యాది పాతక నివృత్తియు గలిగించును.
10. దశముఖము : జనార్దన స్వరూపము భూత భేతాళ సర్పాది పీడలను పోగొట్టును.
11. ఏకాదశ ముఖము : ఏకాదశ రుద్ర స్వరూపము. దీనిని సిగలో ధరించినచో అశ్వమేధ ఫలమబ్బును.
12. ద్వాదశ ముఖము : ద్వాదశాది త్యాత్మకము. ఇది కుడి చెవికి ధరించినచో అశ్వమేధ ఫలమునొంది సంసారభయ విముక్తుడగును.
13. త్రయోదశ ముఖము : కుమార స్వామి రూపము. ఇది దొరుకదు. దొరికినచో సర్వకామ్యార్ధములను సిద్ధించును. పాపములు హరించి, భోగములు సమకూర్చును.
14. చతుర్దశ ముఖము : ఇది దొరుకుట కష్టము. దొరికినచో శిరమున ధరించి సాక్షాత్తు పరమశివుడే యగును. దేవతా పూజ్యుడు గూడ అగును.
రుద్రాక్ష లేవి యైనను మాలగా గ్రుచ్చి జపము చేసిన దాని ఫల మనంత మగును. ఒక్క పూస నైనను దేహమును ధరించినవాడు సర్వ పాపవిముక్తుడగును. దరిద్రుడైనను రాజగును.
ఏకముఖ రుద్రాక్ష పరబ్రహ్మ రూపము. అది ధరించినచో జ్ఞాని యగును. ద్విముఖము అర్దనారిశ్వరము. అది ధరించిన వాడు శివుని ప్రేమకు పాత్రుడగును.
No comments:
Post a Comment