కార్తి కేయుని పట్టాభి షేకము
సభ లోని వారు కార్తికేయుని వివరములు తెలిసినందుకు సంతోషించిరి .శివుడు వీరభద్రుని ,నందిని ,ఇంకను ప్రమదులలో ముఖ్యులను బిలిచి ,"మీరు వెళ్లి కార్తికేయుని సగౌరముగా తీసుకుని రండు .వానికి దేవ సేనాపతిగా అభిషేకము జరుగునని చెప్పుడు " అని పంపెను. వారు సైన్యములతో కుమారస్వామియు కృత్తికలు ఉండు చోటికి వెళ్ళిరి .వారిని జూచి కృత్తికలు భయపడి కుమారస్వామితో చెప్పిరి. అతడు ,"నే నుండగా భయమేల ? రానిండు"అనెను .
నందీశ్వరుడు ముందుకు
వచ్చి "సోదరా ! నేను నందిని .విష్ణుమూర్తి ప్రోత్సాహముతో ఈశ్వరుడు పంపగా వచ్చినాను .నిన్ను మహేశ్వరుడును పార్వతియు చూచుటకు
ఉత్సాహ పడుచున్నారు.
నీకు దేవ సేనాపతిగా అభిషేకము చేయుదురట. నిన్ను తీసుకుని రమ్మని పంపినారు "అని చెప్పగా కుమారస్వామి సంతోషించి ,"ఈ కృత్తికా మాతలు నన్ను విడిచి యుండలేరు. వీరు పుత్ర ప్రేమతో పెంచినందు వల్ల ఇంత
వాడ నైతిని .పార్వతి
గూడ నాకు ఈ మాతలతో సమానురాలె , లోకములో
పాలిచ్చినది ,గర్భమున మోసినది ,తినుటకు
పెట్టినది ,గురుపత్ని ,ఇష్టదైవము యొక్క పత్ని , తండ్రి భార్య (సవతి తల్లి ), వారికి
బుట్టిన (సవతి ) చెల్లెండ్రు ,సహొదరి ,సోదరుల కుమార్తెలు
,పుత్రుని భార్య ,అమ్మమ్మ ,నాయనమ్మ ,సోదరుని
భార్య ,తల్లి తోబుట్టువులు ,మేనత్తలు , మేనమామ భార్య ,భార్య
తల్లి (అత్తగారు ) ,వీరు పదునారుగును వేదము నందు చెప్పబడిన తల్లులు .కావున పార్వతి
యాజ్ఞ చొప్పున నేను
వచ్చేద "నని చెప్పగా చాలా విచారించిరి .వారిని జూచి "తల్లులారా ! మిమ్ము విడిచి పోవుట నాకును సమ్మతము గాదు అయినను, కర్మాదీనులమై మనము ప్రవర్తించు చున్నాము .సర్వమును శ్రీ కృష్ణ భగవానుని ఆజ్ఞాను
సారము నడచుచున్నది
. ఈ జగత్తు సర్వమును దైవాదీనము .మన జన్మములు ,కర్మములు ,ఈ కలయికలు విడి పోవుటలు అన్నియు దైవ నిర్ణయములే .కావున విచారింప
వలదు" అని భోదించి ,"మీరు నా వెంట రండ" ని వారిని గూడా
వెంట బెట్టుకుని బయలు దేరుచుండగా
,సర్వాలంకారముల తోను ,అస్త్ర
శస్త్రముల తోను గూడిన యొక రధము , విశ్వకర్మ
నిర్మించినది. వచ్చి అతని ఎదుట నిలువ బడెను. కార్తికేయుడు కృత్తికల తో సహా ఆ రధముపై నధిరోహించి , నంది వీర భద్రాదులు వెంట రాగా కైలాసమునకు ప్రయాణించెను.
No comments:
Post a Comment