Wednesday, January 15, 2014

శివ గీత37




కలుగనేరదు. నే నొక్కడినే సమస్తములకు కారణభూతుండనై
అయిదు ప్రాకారములుగా నిఖిల లోకమంతటిని
సృష్టించి సర్వాంతర్యామినై యుండెదను.
ఈ విధముగా న్నీశ్వరునిగా తెలిసికొని, పురాణ పురుషునిగాను,
మహాదేవునిగాను పరిశీలించువాడు మిగుల శాంతి చెందును.
ఆకలి దప్పికలకు ఓర్పునకేది పుట్టుకయో  అట్టి ప్రాణములోని
 యాత్మకు కారణభూతుడిగా నన్ను వ్యావహరింతురు.
అట్టి నాయందు మనస్సును కేంద్రీకరింపచేసి ఎవ్వరైతే ధ్యానించుచు
 భజింతురో అటువంటి వారలకే శాశ్వత శాంతి లభించును.
 ఇతరులకు కలుగదు.        

ఏవం మా యే ధ్యాయమానా భజన్తే
తేషాం శాంతి శ్సాశ్వతీ నేత రేషామ్,
యతో వాచో నివర్తంతే - అప్రాప్య మనసా సహా
అనందం బ్రహ్మ మాం జ్ఞాత్వా - న బిభేతి కుతశ్చన       51
శ్రుత్వేతి దేవా మాద్వాక్యం - కైవల్యం జ్ఞాన ముత్తమమ్    
జపంతో మమ నామాని - జపధ్యాన పరాయణాః     52
సర్వేతే స్వస్వదే హంతే - మత్సాయుజ్యం గతాః పురా
త తోయే పరదృశ్యన్తే - పదార్ధా మద్వి భూతయః   53
మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్టితమ్,
మయి సర్వం లయం యాతి తద్బ్రహ్మద్వయ మస్మ్యహమ్     54
అణో రణీయా సహమేవ తద్వ
న్మహా నహం విశ్వమహం విశుద్ధ
పురాతనో హం పురుషోహ విశుద్ధ
హిరణ్య యోహం శివరూపమస్మి        55
అపాణి పాదో హమచింత్య శక్తి:
పశ్యామ్య చక్షుశ్చ  శ్రుణోమ్య కర్ణః
అహం విజానామి వివక్త రూపో
నచాస్తి నేత్తా మమ చిత్సదాహమ్         56
వాజ్మాన సాగో చరుండనై యాన్మడ బ్రహ్మమగు నన్ను
 గుర్తించిన పండితుడు ఎందువలన భయపడడు.
ఇట్లు నా వాక్యములను విని కైవల్యజ్ఞానము నెరింగి
యమరులు నాయొక్క నామములనే ధ్యానించుచు
 జపధ్యాన పరాయణాసక్తులై వారి వారి  శరీరావ సానకాలమున ణా
 సాయుజ్యమునే బడసిరి. అందుచేత నే యే వస్తువు
దృగ్గో చరమగు చున్నవో అవియన్నియు నాయంశములే.
 సమస్తం నాలోనే బుట్టి, నాలోనే ఉండి, నాలోనే లయమగుచున్నవి.
ఆ కారణమున నేనే అద్వితీయ బ్రహ్మనైతిని,
 సూక్ష్మ పదార్ధములలో సూక్ష్మ రూపుడనై


First  30 31 32 33 34 35 36 37 38 39  40 41   Last

No comments:

Post a Comment