వేదములిచ్చుచు బ్రహ్మతో " నాయనా ! సోమకుడు మ్రింగుటచే వేదములు కొన్ని శిదిలమైనవి నీకు జ్ఞాపకమున్నంత వరకు ను వీనిని శిధిల పూరణము చేసి ,స్పురించని చోట ప్రణవముతో పూరించి సమగ్రముగా జేయుము."అని చెప్పి అద్రుశ్యుడయ్యెను .
బ్రహ్మ సృష్టి
బ్రహ్మ ,వేదములు తన దగ్గరకు చేరగానే శక్తి మంతుడై సృష్టి చేయుటకు పూనుకొనెను. మొదట సనక సనంద నాదులను సృష్టించి ,తనకు జీవులను సృష్టించుటలో సహాయము చేయుడనగా ,వారు ,వైరాగ్యము గలవారై ,"తండ్రీ !భార్యలు ,పుత్రులు ధన కనక ,వస్తు , వాహనాది భోగములు అన్నియు అస్తిరములు .వీనిమీద మాకు వ్యామోహము లేదు. శాశ్వతుడైన శ్రీ మన్నారాయణుని గూర్చి తపము చేసికొందుము .మాకు అనుజ్ఞ నిమ్ము " అని వెళ్లి పోయిరి . ఆ తరువాత మనస్సంకల్ప శక్తితో బ్రహ్మ నారదుని సృజించి ,నీవు వివాహము చేసికొని నాకు సృష్టి చేయుటలో సహాయపడుము "అని కోరగా ,నారదుడు ,"తండ్రీ ! సారము లేని యా సంసారములో నేమున్నది ?అనేక సుఖ దుఃఖము లకు నిలయమైన యా సంసార సముద్రమున పడి నేను కొట్టు మిట్టాడ లేను .శ్రీ హరి పాద పద్మములను స్మరించు కొనుచు సుఖముగా నుందును" అని చెప్పగా బ్రహ్మ "నీ అన్నలు సనక సనందనాదులు గూడ పుట్టగానే తపస్సునకు వెళ్ళిరి. నాకు నీవు సృష్టిలో సహాయ పడక తప్పదు."అనెను. నారదుడు ఆ పని తనవల్ల కాదనెను. దానితో బ్రహ్మ ఆగ్రహించి "నీవు తండ్రి మాటలనే దిక్కరించి నావు గాన రెండు జన్మములలో రాజుగాను, మరొక జన్మలో శూద్రుడు గాను పుట్టి ,నీవు వద్దను కొన్న అన్ని కష్ట సుఖములను అనుభవించి ఆ తర్వాత నాకు మానస పుత్రుడవై జన్మింతువు గాక "అని శపించెను . ఆ తరువాత దక్ష కశ్య పాదులను మానసికముగా సృష్టించి వారి ద్వారా సృష్టిని విస్తరింప జేసెను.
దక్ష ప్రజాపతికి అరువది మంది కుమార్తెలు వారిని శివునికి ,చంద్రునకు ,అగ్నికి, కశ్య ప్రజాపతికి ఇటువంటి వారికి ఇచ్చి వివాహములు చేసెను.
కశ్యపునకు అదితి యందు ఇంద్రాది దేవతలును ,దితియందు రాక్షసులును కలిగిరి. ఇంద్రుడు స్వర్గాది పతియై దేవతలకు రాజయ్యెను.
మేరు పర్వతము ,అష్ట దిక్కులు సృజింప బడెను ,ఆమేరు పర్వతము దేవతలకు నివాస మయ్యెను .తూర్పు దిక్కునకు నిర్రుతియు ,పడమటి దిక్కునకు వరుణుడును ,వాయువ్యమునకు వాయువును ,ఉత్తర దిక్కునకు కుబేరుడను ,ఈశాన్య దిక్కునకు ఈశానుడును అధి పతులై పాలింప సాగిరి.
No comments:
Post a Comment