Thursday, January 16, 2014

శ్రీ బ్రహ్మ వైవర్త పురాణము29





శ్రీ కృష్ణ దండకము
శ్రీ శారదాంబో జ పత్రేక్షణా చిత్త పద్మో పలగ్నా సితేంది రా ! ఇందిరా సుందరీ రమ్య సౌదామినీ శోభితాం భోధ నీకాశ వక్ష స్థ్సలీ హార రత్నావళీ కాంతి రేఖా సముద్ద్యో తితా శేష లోకా ! త్రిలోకాంత రస్తాఖిల ప్రాణి హృత్పంక జావాస జీవాత్మ తాంశ స్థితి ప్రాభవా ! భావ నా మాత్ర సంతుష్ట దివ్యాంత రంగా! తరంగా యితో త్తాల కారుణ్య వాః పూర హైమీకృత స్వాశ్రితా నూన సంసార తాపత్రయ క్లేశ భారా ! స్వభారాజితా కాశ విభ్రాజితాది త్యతా రావళీ నాద నక్షత్ర పాళీ గ్రహాళీ ముఖానేక రుజ్మండలా! మండలాకార సంవిష్ట గోపీ సమాజాంత రారబ్ద రాసైక లీలా సముత్సా హ కృద్వేణు గానామృతాసార సుస్నా పితాశేషలోక ప్రజాచిత్త కేదారవారా ! త్రివారాభి ధా మంత్రణో ద్భూత నిర్వ్యాజ కారుణ్య ధారా సముత్పాటి కాతానేక పాదీశ దుఃఖ ద్రుమా ! మాస సంవత్సరాది ప్రమాణాను మేయ ప్రభా చింత్య కాల స్వరూపా ! స్వరూపాను సంధాన చాతుర్య దౌరేయ నీవార ముష్టిం పచాగో చరోదార హృత్కోశ మూలాంతర స్థాయీ తేజో మహత్వ ప్రపూర్ణా ! ప్రపూర్ణా మృత స్థాన సంస్థాపిత స్వీయ సద్భక్త లోకా ! త్రిలాకాది వాసుల్ మహా దుర్లభం భైన నీ విద్య రూపంబు గన్నార జూడంగ వాంచించి యెన్నో తపంబుల్ వ్రతంబుల్ మహా యజ్ఞ యాగాదులుం జేసియున్ గాన లేకుండి రన్నన్ ,భవత్పాద పంకేరుహ ద్వంద్వ మొక్కింత డెందం బునం గూర్చలేనట్టి యత్యల్పుడన్ నేను నీ దర్శనంబున్ మదిం గోరుటం జూడ జాత్యంద రంభాది దృక్షా సమం బౌను గాదే! యిదేలన్న ,నో వాసుదేవా ! సదా నామ సంకీర్తనా సక్తు లెల్లన్ భవత్ప్రీతి పాత్రంబులై యుంట వీక్షించి ,నీ సత్కృపం గోరి ,నీ నామ వర్ణంబులై యొప్పు వేదాక్ష రంబుల్ మహా భక్తితో జిహ్వకుం జేర్చు నన్నుం గటాక్షిం ఛి రక్షింపవే ! వేదమూర్తీ ! హరీ ! దుగ్ధ వారాశి గంభీర రమౌ నీదు కారుణ్య పీయూష సంపాదనం గోరి యేకోన పంచద్వయీ రంద్ర సంయుక్తమౌ నీ ఘటంబున్ వెసం దెచ్చు కొన్నాడ చనె డెట్లు లిద్దాని బూరించి కాపాడెదో దేవ ! దేవాది నాదాదులే నీదు సంపూర్ణ శక్తి ప్రభావలంబులన్ నోర గీర్తింప లేరే ! జగద్వారి రాశిన్ మహాల్పాల్ప యాదః కణం బట్లు నేనెంతవాడన్ !హృషీ కేశ !ఈశాన వాణీ (గీ) శ సంస్తుత్య నామా ! ప్రణామంబులం జేసి నీలీల లంబాడేదన్ నాకు జన్మాంతర ప్రాప్తి బందంబులం బాపి నీలో నమం జేర్చిఆనందు లీలాను సందాయకం బైన ముక్తిం బ్రసాదింపవే ! కానరావే !ముకుందా !మురారీ నమస్తే ,నమస్తే ,నమస్తే నమః .


 First   16 17 18 19  20  21  22  23  24  25  26  27  28  29  30  31 Last

No comments:

Post a Comment