సంక్రాంతి
ఈ సంక్రాంతి పండుగ సూర్యగమనాన్ని బట్టి వచ్చును. మకర రాశిలో సూర్యుడు ప్రవేశించిన నాడు మకర సంక్రమణం అని,అదియే మకర సంక్రాంతి అని పిలువబడుచున్నది.ఈ పండుగ పుష్యమాసంలో వచ్చును.ఈ పండుగను భోగి,సంక్రాంతి,కనుమ, అని మూడురోజులు జర్పుకొందురు.ధీనిని తమిళనాడు లో పొంగల్ అని అందురు.ఆంధ్ర ప్రదేశ్ నందు మూడురోజులు చేయుదురు మరియు మకర సంక్రాంతిని పిత్ర్రుతర్పనములు చేయు రోజులుగా భావించెదరు.సంక్రాంతి పండుగ కు నెలరోజుల ముందునుండే స్త్రీలు రంగవల్లులు ఇంటి వాకిళ్ళ ముందు తిర్చిదిద్దేదరు.ఈ నెలరోజులు పశువులను రంగురంగుల వస్త్రాలతో అలంకరించి వీధులలో ఉరేగింతురు.వీటిని గంగిరెద్దులుగా వ్యవహరిస్తారు.మూడవరోజయిన కనుమనాడు పశువులనన్నిటినీ అలంకరించేదరు.ఈ పండుగ ఎక్కువగా పల్లెలలో వైభవంగా జరుపుకొందురు .తమిళనాడులో మదురై,తంజావురు,తిరుచునాపల్లి మీదుగా కనడ స్వామి దేవాలయము వరకూ రథ యాత్ర నిర్వహిస్తారు .ఈ పండుగరోజు నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమవుతుంది.ఈ సంక్రాంతి రోజున పొంగలి అనే తీపి అన్నమును చేసి దేవుని పూజించి తింటారు.ఈ సమయమున కొత్త ధాన్యములు పండి ఇంటికి వాచుట వలన కొత్త బియ్యముతో పలు,బియ్యమును పొంగించి,సూర్యునికి నివేదనము చేసి ఆరగింతురు.ఈ సంక్రాంతి పండుగ అన్ని పండుగలలోకి పెద్ద పండుగ.ఈ పండుగ సామరస్యమునకు,సమానత్వమునకు ప్రతీక. హైందవతత్వములోని అన్ని ఆచార,సాంప్రదాయములను ఇముడ్చుకొనిన పండుగ ఇది.
ఈ మకర సంక్రాంతిని వెలుగునిచ్చు పండుగగా కూడా వ్యవహరిస్తారు.ఈ మాసము తెలుగునాట ధనుర్మాసముగా ప్రసిద్ది పొందినది.ఈ మాసములో శ్రీమహావిష్ణువు,శ్రీలక్ష్మిదేవిగోదాదేవి,పాండురంగడుగా పిలువబడి వైష్ణవాలయములలో వివాహం జరుపుతారు.ఈ సంక్రాంతి రోజులలో గంగ,సరస్వతి,యమున మొదలగు సర్వ పుణ్య నదులు ఒక్క చోట కలియునని పురాణవాక్యము.దీనినే 'కుంభ మేళ 'అని అనేక మంది సాదు,సన్యాసులు నిర్వహించెదరు.ఈ సమయములో నదుల యందు స్నానం ఆచరించినచో సకల పాపములు తొలిగి పుణ్యము ప్రాప్తించునని పెద్ద లందురు.మహాభారతంలో భీష్ముడు పదిరోజులు అంబుల పొది నే శయ్యగా చేసుకొని పవళించి సంక్రాంతి దినముననే అనగా ఈ ఉత్తరాయణ పుణ్యకాలమందు తన తనువును చాలించెను.
అనేకమైన ఆధ్యాత్మిక ప్రత్యేకతలను సంతరించుకొన్న సంక్రాంతి పండుగ అన్ని పండుగలలోకి పెద్ద పండుగ.ఈ విధంగా ప్రతి పండుగ ఒక అర్ధవంతమైనదిగా మనకు కనపడుతుంది.

No comments:
Post a Comment