Wednesday, January 15, 2014

శివ గీత39




ఏడవ అధ్యాయము
శ్రీరామ ఉవాచ:
భగవ! న్యన్మయా స్పష్టం - తత్త థైవ స్థితం విభో !
అత్రోత్తరం మయా లబ్దం - త్వత్తో నైన మహేశ్వర !     1
పరిచ్చిన్న పరీమాణే - దేహే భగవత స్తవ,
ఉత్పత్తి స్సర్వ భూతానాం - స్థితిర్వా విలయః కథమ్ ?     2
స్వస్వాది కార సంబద్దా కథం - నామ స్థితా స్సురా :,
తే సర్వేత్వం కథం దేవ! - భువనాని చతుర్ధశ                 3
త్వత్త స్శ్రుత్వాపి దేవాత్ర - సందేహొ మే మహాన భూత్,
అప్రత్యాయిత చిత్త స్య - సంశయం చేత్తు మర్హసి             4    
ఓ స్వామీ! ఇంతవరకు నేనడిగిన ప్రశ్నకు సమాధానము
 అనుగ్రహించక పోయితిరి. ప్రాణులు పరిమిత పరిమాణంబగు
నిజ శరీరంబున ఎటులద్భ వించుచున్నది.  ఏ విధముగా పరిమిత
 పరిమాణంబగు నిజ శరీరంబున ఎటులుద్భ వించుచున్నది?
ఏ విధముగా వర్ధిల్లుచున్నది? మళ్ళీ ఏవిధముగా లయ మగుచున్నది?
తమ తమ అధికారములో నుండి సృష్ట్యాదులగావింపుచున్న
బ్రహ్మాది దేవతలును చతుర్దశ భువనంబులను నీ వెట్లైతివి?
నాకు తెలియచేయుము.  ఈ విషయమునంతయు నీ వలన
 పలుమార్లు ఆలకించినప్పటికిన్ని నా చిత్తము నిశ్చలముగా
నుండనందులకు సంశయించితిని, కనుక ఇట్టి  సంశయమును
 నివారించుటకు మీరే సమర్ధులు.    

శ్రీభగవానువాచ:-
వటబీజే సు సూక్ష్మే పి - మహావటరుర్యథా,
సర్వదా స్తే న్యథా వృక్షః - కుత అయాతి త ద్వద       5
తద్వన్మ తనౌ రామ! - భూతానా మాగ తిర్లయ:,    
మహా సైంధవ పిండోపి - జలే క్షి ప్తో విలీయతే          6
న దృశ్యతే పునః పాకా - తత్త ఆయాతి పూర్వవత్,
ప్రాతః ప్రాత ర్యథా లోకో - జాయతే సూర్య మండలాత్       7
ఏవం మత్తో జగత్సర్వం - జాయతేస్తి విలీయతే,
మయ్యేవ సకలం రామ! - తద్వ జ్ఞానీహి సువ్రత!       8
ఓ రామా! జగత్తులో మిక్కిలి చిన్నదగు మర్రి విత్తనములో గొప్పవట
(మర్రి) వృక్షము నిండి యుండి సమయము ననుసరించి
మరల వెలువడునట్లుగా నిఖిల ప్రాణికోటి
నా శరీరమునుండే బయలుదేరు చున్నవి.
 మళ్ళీ నాయందే లీనమగుచున్నవి. సైంధవ పిండము
 (ఉప్పు ముద్దను) జలములో బడవైచిన యది
కరిగిపోయి మరల పాకము


First  30 31 32 33 34 35 36 37 38 39  40 41   Last

No comments:

Post a Comment