గోలోక ప్రశంశ - విశ్వ సృష్టి
పరమాత్ముడైన శ్రీకృష్ణ భగవానుడు గోలోకమున నివసించు చుండును .ప్రళయ కాలమున లోకములన్నియు నశించినను. జ్యోతిర్మండల రూపమైన ఈ గోలోకము నశింపదు . అటువంటిది ఆ గోలోకము . అది అన్నిలోకములకును పైభాగమున నుండును. దాని క్రింద ఏబది కోట్ల యోజనముల దూరమున కుడి వైపున వైకుంటమును ,ఎడమ వైపున శివ లోకమును ఉండును.
గోలోక మధ్య భాగమున ఒక మహా కాంతి ఉండును. ఆ కాంతికి మధ్యభాగమున నీలమేఘశ్యాముడును , పీతాంబర దారియు ,వేణు హస్తుడను ,కోటి చంద్రుల కాంతితో శోభించు వాడును ,సర్వాదారుడును , సర్వ బీజ స్వరూపుడును అయిన శ్రీ కృష్ణ భగవానుడు నివసించును . రాసమండల మధ్యస్తుడై యీయన రాసేశ్వరుడని పిలువబడును .
ఆ శ్రీ కృష్ణ భగవానుడొకసారి విశ్వ మంతటను దృష్టి సారించెను . సర్వమును అందకారముతో నిండియే వస్తువులను లేక సర్వ శూన్యముగా నుండెను .అది చూచిన భగవానునకు సృష్టి చేయవలెనను సంకల్పము కలిగెను. అంతట సృష్టి కారణ భూతములైన సత్వర జస్త మోగుణములు జనించెను. మహత్తు ,అహంకారము ,శబ్ద స్పర్శ రూపర సగంధములను తన్మాత్రలతో పంచ భూతములను (పద్మము ) నుండి పుట్టిన బ్రహ్మ ,శాశ్వతమైన గోలోక ,వైకుంట ,శివలోకములు తప్ప తక్కిన సృష్టి యంతయు చేసెను.
శ్రీ కృష్ణుడు తన నుండి యావిర్భ వించిన బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులతో గలిసి గోలోకము మధ్య భాగమునందు గల మహా ప్రకాశ వంతమై రాస మండలమునకు వెళ్ళెను .అక్కడ నున్న మేడలు ,కల్ప వృక్షో ద్యాన వనములు , వైభవములు చూచి అందరును పరమాశ్చర్య భరితులైరి. శ్రీ కృష్ణుని ప్రాణము లాదారముగా చేసికొని అతని వామ భాగము నుండి ఒక అతిలోక సుందరి పడునారెండ్లది ఉదయించెను. ఆమె వెంటనే శ్రీ కృష్ణ సేవకై పరిగిడెను .రాస మండలమున దావనము చేసినది (పరుగులు పెట్టినది )
గావున ఆమె రాధగా ప్రసిద్దురాలయ్యెను. ఆమె శ్రీకృష్ణునకు ప్రాణాధికురాలైన ప్రియురాలు .

శ్రీకృష్ణుని రోమ కూపముల నుండి అనేకులు గోపకులు జన్మించిరి .రాధ రోమకూపముల
నుండి అనేక గోప
స్త్రీలు జనించిరి. వారందరును రూపములోను వేషములోను శ్రీకృష్ణుని తోను ,రాధ తోను సమానులుగా నుండిరి. ఇంకను గోవులు ,వృషభములు ,లేగ దూడలు ,కామధేనువులు జన్మించెను. వానిలో వేయి సింహముల బలము గల వృషభమును శ్రీకృష్ణుడు శివునకు వాహనముగా నిచ్చెను. కృష్ణుని కాలి గోళ్ళ
నుండి హంసలు పుట్టినవి.
అందులోని ఒక రాజహంస ను బ్రహ్మకు వాహనముగా నిచ్చెను. ఐదు రధములను ,సర్వ
వస్తువులతో నిండి యున్న వానిని సృష్టించి నారాయణునకు ఒకటియు , రాధకొకటియు , ఇచ్చి
మిగిలినవి తన యెద్ద నుంచు కొనెను .ఇంకను కుబేరుడు ,యక్షులు , భైరవులు ,ప్రమధ గణములు , పార్షదులు
మున్నగు వారిని అనేకులను సృష్టించెను.
శ్రీ కృష్ణుడు మహాలక్ష్మిని , సరస్వతిని నారాయణు న కిచ్చెను. సావిత్రిని బ్రహ్మ కిచ్చెను. రతిని మన్మధున కిచ్చెను . శివుని బిలిచి " నీవు సింహ వాహనా రూడురాలైన దుర్గను స్వీకరింపు "మనెను .

No comments:
Post a Comment