Wednesday, January 8, 2014

పంచాంగ విషయాలు 16





స్వప్న ఫలితములు
శుభ స్వప్నములు
సూర్యోదయము , సంపూర్ణ చంద్రోదయము,
 కలలో కనిపించినచో ధన లాభం కలుగును.
క్షేత్ర దర్శనము ,గురువులు ,పుణ్య పురుషులను
 పూజించి నట్లు కల వచ్చిన యెడల సుఖము, సంపదలు కలుగును .
నీటి మీద తిరిగి వచ్చినట్లు కలవచ్చిన శుభము.
పూల తోటలో తిరిగినట్లు వచ్చిన స్త్రీ వలన లాభము.
పచ్చని పైరు కలలో వచ్చిన ధనలాభం కలుగును.
మలము దేహమున పూసుకొన్నట్లును,
ఏనుగు మీద ప్రయాణం చేసినట్లును వచ్చిన అతి త్వరలో
 ధన లాభము కలుగును.
వేశ్యను గాని ,వివాహము జరుగుటను గాని చూచి ,
వారితో మాట్లాడి నట్లు వచ్చిన శుభ కార్యము ప్రాప్తించును.
అన్నము, ఆవు, గుఱ్ఱము,ఏనుగు కలలో కనిపించిన పుత్ర లాభము,
శుభము జరుగును.
శత్రువులను జయించు నట్లు కనిపించిన విజయము,
రక్తము, కల్లు త్రాగునట్లు ,తెల్లని వస్త్రము ధరించినట్లు ,
పూలు కనిపించిన విద్యా ప్రాప్తి, ధన లాభము కలుగును.

అశుభ స్వప్నములు
తల గొరిగిన వాడు గాని, విధవను గాని, చూచుట అశుభము .
 నూనెతో తలంటు కొనినట్లు , దూది ,ఇనుము కనిపించిన మరణము,
ఆపదలు కలుగును.క్షీణ చంద్రుడు నక్షత్రము రాలు చున్నట్లు
కనిపించిన దుఃఖము . పర్వతము ఎక్కుతున్నప్పుడు కాలు
 జారినట్లును ,పడవ ప్రయాణములో మునిగినట్లును కలవచ్చిన మరణము,
 నిలువ ధనమునకు హాని ,ఇంటిలో దొంగలు పడినట్లు
కలవచ్చిన ధనం పోవును.

ధ్యాన స్తోత్రములు
కొన్ని సమయములందు పటించ వలసిన శ్లోకములు
భోజనము చేయుటకు ముందు
శ్లో || అహం వైశ్వా నరో భూత్వాః ప్రాణీనాం దేహ మాశ్రితః
     ప్రాణీనా సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం ||
ప్రయాణమునకు ముందు
శ్లో || ఆపదామపహర్తారం, దాతారం సర్వ సంపదాం
     లోకాభి రామం శ్రీ రామం , భూయో భూయో నమామ్యహం ||
స్నానం చేయుటకు ముందు
శ్లో || అపవిత్రః పవిత్రోవా , సర్వా వస్తాం గతోపివా
     యః స్మరేత్పుండరీ  కాక్షం ,న భాహ్యంభ్యంతర శ్శుచి: ||

No comments:

Post a Comment