Wednesday, January 15, 2014

శ్రీ భవిష్య (కలికి) పూరాణము1




భవిష్య పూరాణము (కలికి పూరాణము)
శౌనకాది మహామునులను జూచి సూతుడిట్లనెను. "మహామునులారా! ద్వాపర యుగములో శ్రీకృష్ణుడై దుష్ట శిక్షణము శిష్ట పరిపాలనము చేసిన శ్రీమన్నారాయణుడు మరల కలియుగములో జన్మించి ధర్మరక్షణ చేయును".

ఆది విని మహామునులు, "మహాత్మా! ఆ కలియుగ మెట్లుండును? అందు ధర్మముల స్థితి యెట్లుండును? ధర్మమును పునరుద్దరింప వలసినంత అవసర మేల వచ్చును? ఆ కలియుగ లక్షణము లెట్టుండును? అప్పటి మానవుల స్వభావ మెట్లుండును? అన్నియు మాకు సవిస్తరముగా తెలియ జెప్పు" మని యడుగగా సూతుడిట్లు చెప్ప నారంభించెను.  
అధర్మము అసత్యము అను దంపతులకు కంభుడు, మాయ అను వారు పుట్టిరి. వారు దంపతులైదభుడు వికృతి అనువారినిగనిరి. వారికి క్రోధుడు, హింస అను కొడుకును కూతురును పుట్టిరి. ఆ దంపతులకే కలిపురుషుడు జన్మించెను.   
కలిపురుషుడు భయం కారాకారము గలవాడు. ఎఱ్ఱని కన్నులు గలవాడు, బానవంటి పెద్ద కడుపు గలవాడు. స్త్రీ వ్యామోహము, సురాపానము, జూదము మొదలైన సమస్త దుర్వ్యసనములు గలవాడు. అతడీ కలియుగమునకు అధిపతి. అతని పాలనలో ధర్మమన్నది మచ్చునకైన కనిపించదు.   

మానవులు తల్లి దండ్రులను సరిగా చూడరు సరి గదా వారిని తిట్టుచుందురు. పెద్దలు మంచి అలవాట్లు అని చెప్పిన వానిని పరిహసించెదరు. వేదములను నిదించి, వేద పండితులను నిరసనగా చూచెదరు. చదువుకొన్నవానికి తగిన గౌరవ ముండదు. వేషభాషలతో ఆడంబరముగా నున్నవానిని అందరును భయ భక్తులతో పూజించెదరు. బ్రాహ్మణులు మంచిచెడ్డ లాలోచించక అందరి యిండ్లలోను పౌరో హిత్యము చేయుదురు. వితంతువులు మరల పెండ్లి చేసికొని గృహిణులగుదురు.అల్పమైన జ్ఞానము, అల్పమైన ఆయుర్దాయము గలవార గుదురు. దొంగతనము లెక్కువయగును. క్రూరత్వము పెరుగును. మాటలలో సత్యమన్నది వెదకినను కాన రాదు. గోవులను జంపి ఆ మాంసమును తిందురు. స్త్రీలను అన్యాయముగా వధించెదరు. (కట్నముల కొరకు కావచ్చు) స్త్రీలు వ్యభిచారములు చేసి, పుట్టిన శిశువులను చంపెదరు.          

పరుల ధనములను, కాంతలను కోరుచుందురు. వేదాధ్యయనములు, యజ్ఞ యాగాదులును క్రమముగా క్షీణించును. ఉత్తమ వంశాలలో పుట్టినవారు కూడ తక్కువ కులాల వారిని సేవించి బ్రతుకుదురు. ఎవరికి బలముండునో వాడె గౌరవనీయుడు. సభలలో ఏవిషయమైనను మాట్లాడ నేర్చినవాడే పూజ్యుడు.    

ఎవనికి బలముండునో వాడు చెప్పినదే ధర్మము, తక్కినది  అధర్మము. కులమతముల ప్రసక్తి లేకుండ కంటికి నచ్చిన దానిని పెండ్లాడుదురు. భోగముల నుభవించుటకు స్త్రీ అన్నది దొరికిన చాలును, దాని గుణ రూపవయస్సులతో

No comments:

Post a Comment