విష్ణువు ,బదరికావనములో నారాయణుడని యు ,ప్రయాగలో మాధవుడనియు ,హరిద్వారములో శ్రీ హరి యనియు ,శ్రీరంగములో రంగ నాదుడనియు ,తిరుపతిలో వేంకటేశ్వరుడనియు, మధురలో శ్రీ కృష్ణుడనియు ,ఇంకను అనేక ప్రదేశములలో అనేక నామ రూపములతో వెలసి ప్రజలను రక్షించు చుండెను.
అట్లే పరమేశ్వరుడు కూడా ,సౌరాష్ట్రమున సోమనాదుడని యు , శ్రీశైలమున మల్లిఖార్జునుడనియు ,ఉజ్జయినిలో మహాకాళుడు అనియు, ఓంకార క్షేత్రమున అమలేశ్వరుడనియు, హిమాలయములలో కేదారేశ్వరుడు అనియు , డాకినిలో భీమ శంకరుడనియు , వారణాసిలో విశ్వేశ్వరుడనియు, గౌతమీ నదీ తీరమున నాసికలో త్రయంబ కేశ్వరుడనియు , పల్వ(ర్వ) ల క్షేత్రమున వైద్య నాదేశ్వరుడు అనియు , దారుకా వనములో నాగేశ్వరుడనియు, సేతు బంధమున (రామేశ్వరంలో ) రామేశ్వరుడనియు , శివాలయములో ఘ్రుష్టే (శ్మే) శుడనియు ,ద్వాదశ స్థానములలో జ్యోతిర్లింగ స్వరూపుడై ,యితర క్షేత్రములలో గూడా అనేక నామములతో వెలసి ,ప్రతిష్టింప బడి ,పూజ లందు కొనుచు ,జీవరాసులను రక్షించు చుండెను.
జగన్మాతయైన పార్వతి గూడ ,లంకలో శాంకరి గాను ,కంచిలో కామాక్షిగాను ,ప్రద్యుమ్నములో శృంగళాదేవిగాను , క్రౌంచ పట్టణములో చాముండీ దేవిగాను ,ఆలంపురములో జోగులాంబ గాను, శ్రీ శైలమున భ్రమరాంబిక గాను , కొల్లా పురములో మహాలక్ష్మీ దేవి గాను ,మాహూరీ నగరమున ఏక వీరా దేవిగాను ,ఉజ్జయిని లో మహాకాళీ దేవి గాను ,పిటాపురములో పురుహూతి కాదేవి గాను ,ఓడ్యాణ పురమునందు గిరిజా దేవి గాను ,హరిద్వార క్షేత్ర మందు కామ రూపిణి దేవిగాను ,ప్రయాగలో మాధవేశ్వరి గాను ,జ్వాలా నగరములో వైష్ణవీ దేవి గాను ,గయ యందు మంగళ గౌరీ దేవి గాను ,కాశ్మీర దేశములో సరస్వతి దేవి గాను , పదునెనిమిది శక్తి పీటాలలో ను ,ఇతరత్రా చాలా చోట్ల అనే నామ రూపముల తోను , గ్రామ దేవతా రూపముల తోను అవతరించి తనను సేవించిన వ్వరి కోరికలు తీర్చు కామధేనువై తన బిడ్డల వంటి జీవులను రక్షించు చుండెను.
అని సూతుడు చెప్పగా విని శౌనకాది మహా మునులు ,వెంకటేశ్వర స్వామి యవన కన్య వేల వివాహ మాదవలసి వచ్చెనో ఆ వృత్తాంతము ను వివరింపు మని యడుగగా సూతుడిట్లు చెప్పసాగెను.
రామ శర్మ కధ
కప్పుడు గౌతమీ నదీ తీరములో ఒక బ్రాహ్మణాగ్రహారము ఉండెడిది .ఆ అగ్రహారములో ఏ ఇంట చూచినను అగ్నిహోత్రములు, ఏ అరుగు మీద చూచినను శిష్యులు వల్లిమ్చు చున్న వేద పనసల నాదములు ,
No comments:
Post a Comment