లిప్పుడు స్వప్న
దృశ్యములవలె కనబడుచున్నవేమి? తెలియ జెప్పు " మనగా అ
జగన్నాథుడు,
"నారదా ! మాయా విలాస మనగా ఇదే.
నీవు చూప మన్నావు గదాయని చూపితిని. నిద్రపోవువాడు తన ప్రక్కల నేమి
జరుగుచున్నదో యెరుగడు. లేచిన తరువాత ఎవరో చెప్పగా
తెలిసికొనును. ఇదియు అట్టిదే నిద్రలో స్వప్నమును జూచి లేచిన తరువాత, నాకిట్లు
వచ్చినదని చెప్పును. కానీ ఆ లాగాను సమయములో తాను పొందుచున్న
సుఖ దుఃఖాను భూతులన్నియు భ్రమలే యని భావించునా? అది; అదియే
మాయా ప్రభావము"
అని వివరించి వెళ్ళెను.
ఒక జన్మ మెత్తగానే జీవులకు పూర్వజన్మ జ్ఞానము నశించును. దానికిని ఈ మాయా ప్రభావమే కారణము.
దేవీ నవరాత్ర విశేషములు
సంవత్సరములో చైత్ర మాసమును ఆశ్వయుజ మాసమును యమదంష్ట్రలు అందురు. అందుచేత చైత్ర శుద్ధ పాడ్యమి మొదలు వసంత నవరాత్రములను, ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు శరన్నవరాత్రములు జరుపును, దేవీ పూజలు నిష్టతో చేయుచుండినచో యమదంష్ట్రా దోషము తొలగి దారిద్ర్యము, అనపత్యత (సంతానము లేకపోవుట), రోగములు తొలగిపోయి, విద్య, సంతానము, ఐశ్వర్యము మున్నగునవి గలుగును. ఈ జన్మము నందు దరిద్రుడుగా నున్నాడనగా, వాడు పూర్వజన్మములో దేవీ నారాధింప లేదన్నమాట.
శరన్నవరాత్రములు చేయునప్పుడు హస్తా నక్షత్రములో దేవీ ప్రతిష్టాపనము మంచిది. సర్వతోభద్ర మండపము పై కలశము నుంచి దానిలో లలితాంబికను ఆవాహనము చేసి తొమ్మిది రూపములలో నున్న దేవిని పూజించవలెను. కొందరు రెండేండ్లున్న కన్య మొదలు పదేండ్ల దాక ఉన్న కన్యలను కూర్చుండబెట్టి పూజించెదరు. వారి పేర్లు ఇవి. మొదటిరోజు పూజింపబడు కన్య పేరు కుమారి. రెండవ రోజున త్రిమూర్తి, మొదవ రోజున కళ్యాణి, నాలుగవ రోజున రోహిణి, ఐదవ రోజున కాళిక, ఆరవ రోజున చండిక, ఏడవ రోజున శాంభవి, ఎనిమిదవ రోజున దుర్గ, తొమ్మిదవ రోజున సుభద్ర, అను పేరులతో ఆ కన్యలను షోడశోపచారములతో పూజించవలెను.
ఒక్క సంవత్సరము లోపు కన్య, బొత్తిగా అజ్ఞానములో నుండును గనుక పనికిరాదు.
బ్రాహ్మణులు బ్రాహ్మణ కన్యలను, క్షత్రియులు బ్రాహ్మణ క్షత్రియ కన్యలను, వైశ్యులు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కన్యలను, శూద్రులు శూద్ర కన్యలను, కంసాలులు కంసాలి కన్యను పూజించవలెను.

No comments:
Post a Comment