Wednesday, January 8, 2014

శ్రీ వామన పురాణము Vamana puranam 5




కాదనెను". రాగిణి కూడా బ్రహ్మను నిందింపగా  అతడు "నీవు ఉదాయాస్తమయములందు సూర్యకాంతితో సంధ్యారాగమై యుండు" కానీ శపించెను.  

బ్రహ్మవలన శాపము నామదిన యిద్దరు కుమార్తెలను దలచుకొని మేనాహిమవంతులు విచారించిరి. చిన్నప్పటి నుండియు శివభక్తురాలైన కాళి, అక్కలు పొందిన యవస్థ చూచి, "అమ్మా! నేను తపము చేసి శంకరుని భర్తగా పొందెదను. అనుమతి నిమ్మని" కోరెను. తల్లిమేన, " అమ్మా, నీవు తపమునకు పోవద్దు" అని వారించెను.
(ఉ = ఓయమ్మా! మా = తపము వద్దు) అందుచేత కాళి అమ్మ పెట్టిన పేరుతో 'ఉమ' అని పిలువబడెను.

అట్లు తల్లి నివారించిననూ వినక తండ్రి యనుమతి తీసుకొని తపస్సునకు వెళ్లి శంకరుని గూర్చి ఘోరమైన తపము చేసెను. బ్రహ్మ దేవతలను జూచి "కాళిని వెంటనే ఇక్కడికి తీసుకొని రండి " అని చెప్పెను. వారు ఉమాదేవిని తెసుకొని పోవుటకు వచ్చి తపము చేయుచున్న యామెను సమీపించుటకు గూడ వీలులేక వెళ్లి బ్రహ్మతో చెప్పిరి. బ్రహ్మ వారితో "నిజముగా జగన్మాత యీమెయే. తపము చేసి క్ల్శంకరుని భార్య యగును" అని పలికెను.

కొంతకాలము తరువాత హిమవంతుడు ఉమాదేవిని తపము నుండి నివారించి యింటికి తీసుకొని పోయెను. శివుడు హిమాలయములలో దిరుగుచుండగా చూచి హిమవంతుడు ఇంటికి పిలిచెను. శివుడు వచ్చెను. పర్వతరాజు " నీ తపోదీక్షను నిక్కడే ప్రారంభింపుము. నీ కొక యాశ్రమము నిర్మించి యిచ్చెద" అనెను. శివుడు అంగీకరించి తపము నారంభించెను. తండ్రి  యాజ్ఞ మీద పార్వతి చెలికత్తెలతో కలసి శివునకు శుశ్రూషలు చేయసాగెను. తపము చేసికోనుచున్న శంకరునికి స్త్రీ సాన్నిధ్యము సరిపడలేదు. అంతర్ధానమై పోయెను. పార్వతి చాలా దుఃఖించెను. తండ్రితో, నేను తపమునకు పోయెద" నని చెప్పి, "లలిత" యను పేరుతో తపోదీక్ష వహించెను. మట్టితో శంకరుని విగ్రహము చేసి దానికి పూజలు చేయుచుండెను.

పార్వతి తపము చేయుచున్నచోటికి అజినము దండము ధరించిన బ్రహ్మచారి యొకడు వచ్చెను. పార్వతి యతనిని గౌరవించి "ఎక్కడి వారు మీరు? ఎక్కడికి పోవుచున్నారు" అని యడిగెను. బ్రహ్మచారి " నా యాశ్రమము వారణాసి లో ఉన్నది. తీర్ధ యాత్రలు చేయుచు పృథూదకమునకు వెళ్ళుచున్నాను. "అనగా ఉమాదేవి, "ఏ ఏ తీర్ధములు సేవించినారు " అని యడిగెను. "నేను ప్రయాగాడి అనేక తీర్దములలో స్నానమాడి దారిలో నీ యాశ్రమమునకు వచ్చితిని. అది సరే కాని నీవు ఈ నవయౌవనములో వివాహము మాని తపము చేయుచున్నావు. సుందర రూపమును, ఐశ్వర్యమును గోరి తపము చెయుదురు. అన్నియు నీ కున్నవి. మరెందుకు తపస్సు చేయుచున్నావో చెప్పుము" అని యడిగెను. పార్వతి చెలికత్తె యైన సోమప్రభ " అయ్యా! మా పార్వతి ఈశ్వరుని భర్తగా కోరి తపము చేయుచున్నది". అని పలుకగా, ఆ బ్రహ్మచారి "పార్వతి! ఈశ్వరుని పెండ్లాడు బుద్ధి నీ కెవ్వరు చెప్పగా వచ్చినది? చిగురుటాకు వంటి నీ చేయి సర్పములతో కూడిన శివుని చేతి నెట్లు పట్టుకోగలదు? నీవు కట్టిన

No comments:

Post a Comment