(మంగళ హారతి ఇచ్చి, శివలింగాన్ని కొంచెం కదపవలెను.)
(పదహారు సోమవారాల వ్రత పూజా విధానం సమాప్తమ్)
సోమవారవ్రత కథ
శ్రీ గురుభ్యోనమః
మృత్యుంజయాయ రుద్రాయ నీలకంటాయ శంభవే అమృతేశాయ
శర్వాయ మహాదేవాయ తే నమః ||
నైమిశారణ్యముములో
జ్ఞాన యజ్ఞ నిరతులైన శౌనకాది మహర్షులు
సూతునకు నమస్కరించి ' ఓ మహర్షి !
మీరు మాకు అనేక సత్కథలు చెప్పితిరి.
ఏ వ్రతమును ఆచరించుట వలన శ్రీఘ్రముగా
ఫలప్రాప్తి కలుగునో అటువంటి
ఉత్తమోత్తమైన వ్రతము నొకదాన్ని మాకు
ఉపదేశింపు' డని ప్రార్ధించిరి.
అంతట
సూతుడు " ,మహాత్ములైన మహర్షులారా! కొంత కాలము క్రితము
పార్వతీ దేవి
పరమేశ్వరుని ఇదే ప్రశ్నవేయగా శివుడు ఆమెకొక రహస్యం చెప్పాడు.
ఆ రహస్యమునే
నేను మీకు చెబుతాను" అని ఇట్లు ప్రారంభించెను.
ఒక రోజు కైలాశములో దివ్య
రత్న ఖచిత సింహాసనంపై కూర్చొనియున్న పరమేశ్వరుని
పార్వతి ఏకాంతంలో ఇట్లా
ప్రశ్నించింది. దివ్యమైన ముఖారవిందము పై మందహాసం,
చేతులలో వారము అభయపు
ముద్రలు పులి చర్మమును ధరించిన భగవంతుడైన
సదాశివుని ఆమె అడిగిన ప్రశ్న
ఏమంటే - " స్వామీ! నేను మీవడా అనేక
శాస్త్రములను ఆగమ విద్యలను
నేర్చుకున్నాను.
సర్వకాల సర్వావస్థలలోను అల్పప్రయాసతే మహత్తరమైన ఫలమును
ప్రసాదించు
వ్రతము నొకటి నాకు ఉపదేశించుడు" అది విని మందహాసముతో సదాశివుడు
"
ప్రియా! నీ ప్రశ్న ఉచితముగాను, లోకోపకారిగాను ఉన్నది.
లోకహితము కోరిన నీకు ఒక శ్రేష్టమైన వ్రతమును చెప్పెదను" అంటూ ఇలా చెప్పసాగాడు.
నక్షత్రములలో
సూర్యుడు, గ్రహములలో చంద్రుడూ నదులన్నింటిలో గంగానది,
ఇంద్రియములలో
మనస్సు ఏవిధముగా శ్రేష్టమైనదో, వ్రతములన్నింటిలో
ఈ సోమవార వ్రతము
శ్రేష్ఠమైనది.
ఈ వ్రతమునకు " షోడశ సోమవారవ్రతం" అని పేరు. దీని మహిమలను
వర్ణించుట అసాధ్యము.
భక్తీ పూర్వకముగా దీనిని ఆచరించువారు ఏదేది
కోరుకొందురో దానిని వారు శీఘ్రముగా పొందుతారు.
దరిద్రులు ధనవంతులు అవుతారు.
కన్నియలు యోగ్యులైన వరులను పొందుతారు.
ముత్తైదువలు అఖండ సౌభాగ్యమును
పొందుతారు. రోగులకు సంపూర్ణారోగ్యము కలుగును,
ఎడబాసిన భార్యాభర్తలు
ఒకరినొకరు చేరుకొందురు.
No comments:
Post a Comment