Thursday, March 13, 2014

శ్రీ బ్రహ్మ వైవర్త పురాణము22




నీవు నీ భర్తను పురోహితునకు దక్షిణగా నిచ్చి ,తిరిగి ఏదైనా ఇచ్చి నీ భర్తను కొనుక్కొ (గొ)నుము .బ్రాహ్మణునకు సరి సమానమైన విలువలు కలది కావున గోవులనిచ్చి నీ భర్తను మరల తెచ్చి కొనుము " అని చెప్పి అద్రుశ్యు డయ్యెను . పార్వతి ఎట్లో మనసు సరి పెట్టుకుని బ్రహ్మ దక్షిణగా శివుని దానము చేసెను . తరువాత "సనత్కుమారా ! నీకు నేను లక్ష గోవుల నిచ్చెదను నాపతిని నాకిమ్ము " అని అడిగెను .సనత్కుమారుడు , "ఇటువంటి మహానుభావుడు నాకు లభించుట నా యదృష్టము ." "జ్ఞాన మిచ్చేత్ మహేశ్వరాత్ " అని యందురు గదా !మహాజ్ఞాన స్వరూపుడైన ఇతని నేనెట్లు వాదులు కొందును ?" అనుచు శంకరుని తిరిగి ఇచ్చుటకు నిరాకరించెను .అపుడు బ్రహ్మాది దేవతలు అతనికి నచ్చ చెప్పి శంకరుని పార్వతికి ఇప్పించిరి .

ఈ వ్రతమిట్లు పూర్తి యైనది .పరమేశ్వరుడు పార్వతితో ఏకాంత మందు ఉండెను. శ్రీ కృష్ణుడా సమయమున వృద్ద బ్రాహ్మణ వేషముతో వచ్చి ,"తల్లీ పార్వతీ ! నేనన్నము తిని ఏడు రోజులయినది . నాకు అన్నము పెట్టనిచో ప్రాణములు నిలువవు .దయతో చూడుము " అని ప్రార్ధించెను . ఇది విని పార్వతి త్వరగా ఈవలికి వచ్చెను. శివునకు తేజస్సు జారి శయ్య మీద పడెను. పార్వతి బ్రాహ్మణునకు అతిధి మర్యాదలు చేసెను . నీకు శ్రీకృష్ణుని అంశతో కుమారుడు కలుగు "నని దీవించి బ్రాహ్మణుడు వెళ్ళిపోయెను . పార్వతి వెళ్లి చూచు సరికి శయ్య మీద చక్కని బాలుడు కనబడెను , ఈ బాలుడెవడని పరమేశ్వరుని అడుగగా శివుడు అతడే గణపతి యనియు నీ కుమారుడనియు చెప్పెను .
పార్వతి ఆ బాలుని చూచి ముచ్చట పడి యెత్తుకొనెను .పుత్రుడు కలిగినందుకు పార్వతీ పరమేశ్వరులు గోదానాదులు చేసి మహా వైభవముతోబాల సారె(బారసాల ) జరిపిరి. దేవతలందరును వచ్చి బాలుని దీవించి కానుక లిచ్చి పోవుచుండిరి .సూర్య పుత్రుడగు శనైశ్చరుడు గూడ బాలుని చూడవచ్చెను .కాని అతడు బాలుని మొగమును జూడక తల దించుకుని కూర్చుండెను .పార్వతి శనిని ,"అదేమయ్యా ,తల దించుకుని కూర్చున్నావు ? పిల్లవాని మొగము చూడవేమి ? నా పుత్రుడన్నచో అంత చూడ దగనివాడా ? నీ ఈ తిరస్కారమును సహింపజాలను .
ఒక శుభ దినము నందు శ్రీకృష్ణుడు గణపతి దగ్గరకు వచ్చి ,గజాననుని ,"సర్వ దేవతలలో ను అగ్ర పూజ్యుడ వుగా నుందువు .నిన్ను సర్వ దేవతలను గణాదిపతిగా స్తుతించి పూజింతురు " అనుచు వనమాల నిచ్చెను. సర్వ దేవతలును సర్వా లంకారములు నొసంగిరి .అందరును గలిసి గణేశునికి షోడశోపచార పూజలు చేసి మంత్ర కవచములతో ఆరాధించిరి .


 First   16 17 18 19  20  21  22  23  24  25  26  27  28  29  30  31 Last


No comments:

Post a Comment