Tuesday, March 25, 2014

షోడశ (16) సోమవారాల వ్రతవిధానం-2



తెలుగు సంవత్సరము ను అంటే పూజ చేయునపుడు ఏ సంవత్సరము జరుగు చున్నదో
 ఆ సంవత్సరము 
 యొక్క పేరు చెప్పు కొనవలెను )
 ,............ ఆయనే, (సంవత్సరమునకు రెండు ఆయనములు -ఉత్తరాయణము,
 దక్షిణాయనము. జనవరి 15 మకర సంక్రమణం మొదలు 
జూలై 14 కర్కాటక సంక్రమణం వరకు ఉత్తరాయణము ,జూలై 15 కర్కాటక సంక్రమణం
 నుండి మరల జనవరి 14 పెద్ద పండుగ అనగా మకర సంక్రమణం వరకు దక్షిణాయనం పూజ
 చేయునపుడు ఏ ఆయనము జరుగుచున్నదో దానిని చెప్పవలెను ) ఋతు :
 (వసంత , గ్రీష్మ , వర్ష మొ || ఋతువులలో పూజ సమయములో జరుగుచున్న ఋతువు పేరు ) ...........మాసే ,
 ( చైత్ర, వైశాఖ మొ || పన్నెండు మాసములలో పూజ సమయములో జరుగుచున్న మాసం పేరు ) 
 ......... పక్షే , (నెలకు రెండు పక్షములు పౌర్ణమికి ముందు శుక్ల పక్షము ,
 అమావస్యకు ముందు కృష్ణ పక్షములు వీటిలో పూజ జరుగుచున్న సమయమున గల పక్షము పేరు )
 ............ తిధౌ , (ఆ రోజు తిది ) ......... వాసరే
 (ఆ రోజు ఏ వారమైనదీ చెప్పుకొని ) శుభ నక్షత్రే , శుభయోగే ,శుభ కరణే ఏవంగుణ విశేషణ విశిష్టాయాం
 శుభ తిదౌ మమ చతుర్విధ పురుషార్ధ సిద్ధయే ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా
 శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం పురుషులైనచో శ్రీమాన్ ........గోత్రశ్య
            ....... నామధేయః , శ్రీమత్యః , గోత్రస్య ,నామ దేయస్య అనియు , స్త్రీలైనచో  శ్రీమతి , గోత్రవతి ,
 నామదేయవతి, శ్రీ మత్యాః , గోత్ర వత్యాః నామదేవ వత్యాః అనియు (పూజ చేయువారి గోత్రము , నామము చెప్పి )
 నామ దేయశ్యః ధర్మపత్నీ సమేతస్య (పురుషులైనచో ) మమ సహ  కుటుంబస్య,
  క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృధ్యర్ధం సకల విధ మనో వాంచా ఫల సిద్ద్యర్ధం, 
 సంభ వద్బి రుపచారై : సంభవతాని యమేన సంభవతా ప్రకారేణ యావచ్చక్తి (నాకు తోచిన రీతిలో , 
 నాకు తోచిన నియమములతో , నాకు తోచిన విధముగా , భక్తి శ్రద్దలతో సమర్పించు కొంటున్న పూజ ) 
ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే || పిదప కలశారాధనము చేయవలెను .

వక్రతుండ ! మహాకాయ ! కోటిసూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా ||
శ్రీ మహాగణపతయే నమః ధ్యాయామి - ఆవాహయామి ఆసనం - పాద్యం - ఆచమనీయం - 
స్నానం - వస్త్రం - గంధం - ధూపం - దీపం - నైవేద్యం - ఇత్యాది షోడశోపచార పూజాం సమర్పయామి ||
కలశ పూజ :  పూజకోసం సిద్ధ పరచుకొన్న కలశపాత్రలో నీరు, గరిక, 
 బిల్వ పత్రం, దుంపపసుపును వేసి, దానిపై కుడుచేతి నుంచి ప్రార్ధించవలెను.
గంగైచ యమునేచైవ కృష్ణే , గోదావరి , సరస్వతి ,
నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు ||


First 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13  14 15 16 17 18 19 20 21  Last

No comments:

Post a Comment