అమరులు సఫలీ భూతంబు లగు కర్మలు పసిగట్టి పరమ శివుని
యనుగ్రహము వలన దమకెటువంటి చెరుపు (నష్టము ) కలుగునో
యని భయముతో నాతడు చేపట్టిన కార్యములకు ఏ విధమైన
ఆటంకములను కలిగింపక పలాయన మగుదురు.
జాయతే తేన శుశ్రూషా - చరితే చంద్ర మౌళిన:
శృణ్వతో జాయతే జ్ఞానం - జ్ఞానా దేవి విముచ్యతే 19
అందువలన మానవుడెల్లప్పుడు శివార్పణ బుద్ది కలిగి నిష్కామముతో
శివార్చన శివ కధా శ్రవణాదులందు జ్ఞానార్జనను గావించు కొనును.
దాని ప్రభావమున సంసృతి మోక్షమును పొందును.
బహునాత్ర కిముక్తేన - యస్య భక్తి శ్శివే దృడా,
మహాపాపో పపాపౌఘ - కోటి గ్రస్తో విముచ్యతే 20
వేయేల ఏ భక్తుడి కైతే పరమశివుని యందు దృడమై నిర్మలమగు భక్తి
కలుగునో అట్టివాడే మహా పాపముల చేతను ముక్తుడగును.
అనాధ రేణ శాట్యేన - పరిహాసై ర సూయయా,
శివ భక్తి రతశ్చేత్స్యా - దంత్య జో సివి ముచ్యతే 21
అస్పృశ్యు డైనను, కారణ మేమియు లేకుండ గాని, వంచ కత్వముతో గాని ,
పరిహాసమునకు గాని , ఈర్ష్య చేత గాని శివుని యందు భక్తి
యంకురించిన యెడల అటువంటి వాడు సమస్త పాపముల
నుండి ముక్తుడగును.
శివ భక్తిశ్చ సర్వేషాం - సర్వదా సర్వతో ముఖా,
తస్యాం చ లిష్య మానాయాం - యస్తు మర్త్యో విముచ్యతే .22
సంసార బంధ నాత్తస్మా - ధన్యః కో వావి మూడది :
శివ భక్తి ఎవరి యందు దృడ పడునో వారలకు (శివ భక్తులకు )
ఎల్లప్పుడు కోరికలను దీర్చును. దానిలో పూర్తిగా ఆసక్తి గలవాడు
ఈ సంసార పాశ బంధముల నుండి విడువ బడుచున్నాడు.
నియ మాద్యస్తు కుర్వీత - భక్తిం వాద్రో హమేవ వా ;
తస్యాపి చేత్ప్ర సన్నో సౌ - ఫలం యచ్ఛతి వాంచితమ్ 23
బుద్దిం కించిత్స మాదాయ - క్షుల్లకం జలమేవ నా ,
యోదత్తే నియమేనా సౌ - తస్మై దత్తే జగత్ప్రయమ్ 24
ఏనాడు నియమము తప్ప కుండా పరమ శివుని పై భక్తితో గాని,
చెడ్డ తనము చేయకుండగా గాని ఆచరించునో అట్టి
No comments:
Post a Comment