Wednesday, March 5, 2014

శ్రీ మత్స్య పురాణము14




ఏ వాకిట్లో చూచినను శాస్త్ర చర్చలు కనబడును. ఆ గ్రామములో యజ్ఞము చేయని బ్రాహ్మణుడు లేడు. వేద శాస్త్రములు రాని ద్విజుడు లేడు. అగ్రహారపు భూములపై వచ్చు ఆదాయములతో కర్మానుష్టానము చేయుచు ,తాము ఇంత తినుచు ,అతిధులుగా వచ్చిన వారికి తృప్తిగా పెట్టుచు సుఖముగా నుండిరి. పాడి పంటలకు కొదువలేదు.
ఆ అగ్రహారములో నారాయణ శర్మ యను నిష్టా గరిష్ఠుడైన బ్రాహ్మణుడుండెను. అతని భార్య సోమిదమ్మ భర్తకు తగిన ఇల్లాలు . భర్త కనుసన్నలలో మెలగుచు ఆయన చేయు యజ్ఞ యాగాది కర్మలలో తన వంతు సేవల నందించి ,సహధర్మచారిణి అనిపించు కొనుచుండెడిది. చాలా కాలమునకు వారి కొక్క కుమారుడు కలిగెను .పుట్టిన పదునొకండవ జాతకర్మాదులు ,శాంతులు జరిపి రామశర్మ యని నామకరణము చేసిరి. శుక్ల పక్ష చంద్రుని వలె దిన దిన ప్రవర్ధ మానుడగుచున్న ఆ బాలునికి క్రమముగా అన్న ప్రాశనము ,పుట్టు వెంట్రుకలు తీయుంచుట (చౌలము ) అను సంస్కారములు జరిపి అయిదవ ఏట అక్షరాభ్యాసము చేయించిరి. "గర్భాష్ట మేషు బ్రాహ్మణ ముపన యీత" అను సూత్ర ప్రకారము ఏడవ యేడు రాగానే ఉపనయన సంస్కారము చేసి గురువుల దగ్గరకు బంపి వేద శాస్త్రములు చదివించు చుండిరి .
కొంత కాలము గడచినది .రామశర్మకు చదువింకను పూర్తి కాలేదు. లోకజ్ఞానము కూడా పూర్తిగా కలుగలేదు. ఇట్టి సమయమున అతని తల్లి దండ్రులు ఇరువురును రోగ గ్రస్తులై మరణించిరి.
పోవుచు పోవుచు రామశర్మను మేనమామలకు అప్పగించి మంచి  చెడ్డలు చూచు చుండమని ప్రార్ధించిరి. వారికి మేనల్లుని మీద కన్న, అతని ఆస్తి పాస్తులపై (బూమి గృహాదులను ,పశు ,ధన కనక వస్తు వాహనాదులను) అనురాగ మెక్కువ .వారు ఇతని యాస్తులను స్వాదీనము చేసికొని వీనికి సరిగా తిండి పెట్టక చదువులు పూర్తిగా చెప్పించక ,నష్ట జాతకుడనియు, మూర్ఖుడనియు ,దుర్వర్తనము కలవాడనియు దూషించు చుండెడి వారు .పూర్తిగా భాల్యము వీడని రామశర్మ క్రమముగా దుష్ట స్నేహములకు అలవాటు పడి ,చదువులు విడిచి స్వేచ్చగా అదుపును ఆజ్ఞయు లేకుండ తిరుగ సాగెను . అతని మేలు కోరిన బంధు మిత్రులు ,"నాయనా ! చదువు సంధ్యలు విడిచినావు. దుర్జన సహవాసములు చేయుచున్నావు. నీ వంశ మెటువంటిది.? నీ తాతలు తండ్రులు అందరును మహా పండితులు .నీవు ఇట్లు ప్రవర్తించు చున్నందులకు మాకు చాలా విచారముగా నున్నది. నీవు బుద్ది మంతుడవై నీ వంశము కీర్తి ప్రతిష్టలు నిలుప గలవా ?" అని చాలా సార్లు భోధించు చుండగా ఒకనాడు రామశర్మ తన హితము కోరిన వారి మాటలు ఆదరించి ఇట్లనెను, "బంధు మిత్రులారా ! నా క్షేమము కోరి మీరు నాకు హితబోధ చేసినందుకు సంతోషము .మీరు చెప్పినట్లే విద్యలు నేర్చు కొనుటకు నేను కాశీకి వెళ్లి మంచి గురువులను ఆశ్రయించెదను. "అని చెప్పి ,మేనమామలకు చెప్పి కాశీకి పయనమై పోయెను. అచట పండితుల నాశ్రయించి వారికి శిష్యుడై విద్యలు నేర్చు కొనుచుండెను . ఒకనాడు శ్రీ విశ్వనాధుని దర్శించుటకు ఆలయమున కేగి ,అచట ఉత్తర ద్వారముపై ,ఒక శిలా శాసనమును జూచెను. దానిపై ఇట్లు చెక్కబడి యున్నది. "ఈ కాశీ గంగను దీసికొని పోయి రామేశ్వరములో నున్న రామేశ్వరునకు అభిషేకము చేసి అచటి సేతువు వద్ద నున్న సముద్ర


No comments:

Post a Comment