నారదుడు
బ్రహ్మకు మానస పుత్రులుగా సనక సనంద నాదులు పుట్టి తపమునకు బోయిరి .దక్షుడు మున్నగువారు సృష్టికి తోడ్పడిరి నారదుడు బ్రహ్మ మానస పుత్రుడై జనించెను. అతడు వివాహము చేసికొనుటకు విముఖుడై యుండి , నన్నీ సంసార సాగరమున దింపకు మని తండ్రిని గోరెను. దానికి బ్రహ్మ కోపించి "నీవు మొదట గంధర్వుడవు గాను ,తరువాత శూద్రుడవు గాను జన్మించి ఆపైన నాకు మానస పుత్రుడవై హరి భక్తుడవగుదవు" అని శపించెను . నారదుడు గూడ కోపించి " శ్రీ కృష్ణ పద భక్తి ననుగ్రహింపని వాడు ఏమి తండ్రి ? ఏమి గురుడు ? నిరపరాధి నైన నన్ను శపించి నాడవు గావున మూడు కల్పముల కాలము నీవు ఈ విశ్వము నందెచ్చటను పూజా పురస్కారములు పొంద కుండెదవు గాక !" అని తిరిగి తండ్రిని శపించెను .హరి జేరుమనెడు తండ్రియే తండ్రి గదా మరి !
No comments:
Post a Comment