నారద తుంబరులు
ఒకప్పుడు నారదుడు నారాయణుని తన గానముతో సేవింపవలెనని వైకుంఠమునకు వెళ్ళెను. ఆయన నారదుని వైపు చూడకతుంబురుని పిలిపించుకొని లక్ష్మీదేవితో గలసి గానము విని యానందించి అతనికి ఘనమైన సన్మానము చేసెను. అది చూచి, నారదుడు, " నాకంటే తుంబురుడు గాన విద్యలో నెక్కువ పండితుడా? ఎన్నాళ్ళనుండియో శివ కేశవులను నా గానముతో కొలుచు చున్నానుగదా! ఈనాడు కేశవునికి నామీద దయ తప్పిన దేమి? నేను సరస్వతీ దేవిని గూర్చి తపముచెసి గాన విద్యలో పూర్ణ పాండిత్యము సంపాదించి శ్రీనాధుని మన్నన పోందవలె " నని భావించి వేయి దివ్య వర్షములు వాణీ దేవిని గురించి తపము చేసెను. అతనికి అప్పుడు " నీవు మాన సోత్తర శైలము పై నున్న గాన బంధు గ్రుడ్ల గూబ దగ్గరకు వెళ్ళి ఆయన వద్ద సంగీతము నేర్చుకొనుము" అని ఆకాశ వాణి వినిపించెను.
నారదుడు మానస్తోతరగిరికి వెళ్ళిగాన బంధువును దర్శించెను. అతడు, నారదుడు తన దగ్గరకు వచ్చినందుకు చాల సంతోషపడి, " యిట్లు వచ్చుటకు కారణమేమి? " అని అడిగెను. నారదుడు చెప్పెను. గాన బంధువు " నాకంతకన్న కావలసిన దేమి ? నాకు చేత నైనంత వరకు నేర్పెద " ననుచు, తన పూర్వజన్మ వృత్తాంత మిట్లు చెప్పెను.
నేను పూర్వజన్మములో ఒక రాజును. గాన విద్యలో పండితుడను. రాజ్యపాలనములో గూడ శిష్టులను రక్షించుచు దుష్టులను శిక్షించుచుడెడి వాడను. పరమ శివ భక్తుడనై సంగీతముతో శంకరుని సేవించు చుండువాడను. కొన్నాళ్ళకు నాలో అహంకారము తలయెత్తి, నన్ను దప్ప ప్రజలు ఏ దేవుని పూజింపరాదు, కీర్తింపరాదని శాసించితిని. ప్రజలు, రాజున కిట్టి బుద్ద పుట్టిన దేమని యాశ్చర్యపడిరి.
No comments:
Post a Comment