Thursday, March 6, 2014

బ్రహ్మపురాణము2




ఎవ్వడైనను ఈ సూర్యుని చరిత్రమును విన్నను, పటించినను ఆపదలనుండి విముక్తుడై ఆయురారోగ్య సంపదలను బొందును అని సూతుడు మరల నిట్లు చెప్పసాగెను.

ఈ సూర్యునికి మరి పండ్రెండు పేరులు గలవు. వానిని స్మరించినచో మహాపాతకములు నశించును.
ఆ పండ్రెండు నామములులేవియనగా:
1 . ఆదిత్యుడు 2 . సవిత 3 . సూర్యుడు 4 . మిహిరుడు 5 . అర్కుడు 6 . ప్రభాకరుడు 7 . మార్తండుడు 8 . భాస్కరుడు 9 . భానుడు 10 . చిత్రభానుడు 11 . దివాకరుడు 12 . రవి
మొదట చెప్పిన పండ్రెండు నామములతో సూర్యుడు, పండ్రెండు మాసములలో ఉండుచు, కాల చక్రమును నడుపుచుండును.
1 . చైత్ర మాసమున - విష్ణువుగాను
2 . వైశాఖ మాసమున - ఆర్యముడు గాను
3 . జ్యేష్టమున - వివస్వంతుడు గాను
4 . ఆషాడమున - అంశుమంతుడు గాను
5 . శ్రావణమున - పర్జన్యుడు గాను
6 . భాద్రపదమున - వరుణుడు గాను
7 . ఆశ్వయుజమున - ఇంద్రుడు గాను
8 . కార్తికమున - ధాతగాను
9 . మార్గశిరమున - మిత్రుడు గాను
10 . పౌష మాసమున - పూషగాను
11 . మాఘమాసమున - భగుడు గాను
12 . ఫాల్గుణ మాసమున - త్వష్ట గాను
సంచరించుచు, లోకములకు శుభములు గలిగించుచుండును.
సూర్యునకు మార్తండుడు (మార్తాండుడు) అను పేరువచ్చుటకు కొక కారణమున్నది.  (పూర్వము అదితి సంతానము కోరినదై కశ్యపునితో సంసారము చేసెను. ఆమెకు రెండు అందములు (గ్రుడ్లు) పుట్టెను. అందొక గ్రుడ్డు పుట్టుకతో జీవములేనిదిగా కనబడెను. అందుచేత అదితి దానిని విసర్జించెను. అయితే స్వప్రకాశముగల సూర్యుడు దానినుండి తరువాత వెలువడెను. మృతమైన అండమునుండి వెలువడినవాడు కావున మార్తండుడని పిలువబడినాడు ఇది యొక కథ.


Last   2  3  4  5  6  7  8  9  10  11    Last

No comments:

Post a Comment