Wednesday, March 12, 2014

శివ గీత7




రుద్రాక్షలను మేన దాల్చిన చతుర్వేద సారములైన శివ సహస్ర
నామములను వల్లింపు చుండ దత్ప్రభావము చేత అశాస్వతమగు
 నీ మనుష్య త్వమును వీడి శివ స్వరూపమును పొందగలవు.

తతః ప్రసన్నో భగవాం- చ్చంకరో లోక శంకరః ,
భవతాం దృశ్యతా మేత్య - కైవల్యం వః ప్రదాస్యతి. 38
రామాయ దండ కారణ్యే - యాత్ప్రా దాత్కుంభసంభవ: ,
తత్సర్వం వః ప్వక్ష్యామి - శృణు ద్వం భక్తి యోగినః 39
ఇతి శ్రీ పద్మ పురాణే శివ గీతాయాం ప్రధమోధ్యాయః
తరువాత లోక కళ్యాణ కర్త శంకరుడు మీ యందనుగ్రహము
కలవాడై ప్రత్యక్షమై కైవల్య మిచ్చును.
 పూర్వ కాలమున దండకారణ్యములో తన భార్యను కోల్పోయిన
శ్రీరామ చంద్రునకు అగస్త్య మహాముని యే యోగశాస్త్రము నుపదేశించి
 యుండెనో అట్టి దానినే సర్వమును మీకును బోధింతును కనుక
 అత్యంత భక్తి గలవారై ఆలకింపుడు.
ఇది వ్యాసోక్త శ్రీ పద్మ పురాణాంతర్గతం బైన శివ గీతలో
ప్రధమాధ్యాయము పరి సమాప్తము.

అధ ద్వితీయాధ్యాయము
వైరాగ్య యోగము

ఋషయ ఊచు :-
కిమర్ధ మాగతో గస్త్యో రామచంద్ర స్య సన్నిధిమ్,
కధం వా విరజాం దీక్షాం - కార యామాస రాఘవమ్ 1
తతః కిమాప్త వా న్రామ :- ఫలం తద్వక్తు మర్హసి,
ఋషులు వక్కాణించిరి :-
ఓయీ సూత మహాముని! దండకారణ్యం బులో నున్న
 శ్రీరాముని వద్దకు అగస్త్య మహాముని యెందులకు గాను వచ్చెను ?
 ఎ విధముగా శ్రీ రామునికి విరజా దీక్ష నోసంగెను.?
 ఆ పైన రాముడేమి ఫలము నార్జించెను?
ఆ సమస్తమును విస్తారముగా మాకు తెలుపుము.
అనిన విని సూతుడిట్లు చెప్పెను:

రావణేన యదా సీతా సహృతా జన కాత్మజా ,
తదా వియోగ దుఃఖేన- విల పన్నా స రాఘవః 2
నిర్నిద్రో నిరహంకారో - నిరాహారో దివానిశమ్
మోక్తు మైచ్చత్తత: ప్రాణా- న్సానుజో రఘు నన్దనః 3
ఎప్పుడైతో సహదర్మ పత్ని యగు సీతాదేవి రావణాసురుని చేత
అపహరింపబడి నదో అప్పుడు శ్రీ రాముడు ప్రియురాలి


First 1 2 3 4 5 6 7 8 9  10 11 Last

No comments:

Post a Comment