Friday, March 28, 2014

శని మహాత్మ్యము-4




కథా ప్రారంభము
ఇమ్మహీమండల మండనాయ యానంబగు ఉజ్జయినీ
 పురమును విక్రమార్క మహారాజు పాలించుచుండెను. 
 ఇట్లుండ నొకనాడుదయ కాలంబున నమ్మహీపాలుండు సేవక జనులు
 పరివేష్టింప సామంతరాజులు గొలువ మంత్రులిరుపార్శ్వములయందు
 గూర్చుండి ప్రభునాజ్ఞకై నెదురు చూచుచుండ,
 పండితులు వేదశాస్త్ర పూణేతి హాసంబులు జర్చింపుచుండ,
 వంది మాగధులు గొలువ రత్న ఖచితంబగు సింహాసనంబున 
 గూర్చుండి పండితుల వైపుంజూచి పండితులారా! నవగ్రహములలో శ్రేష్టులెవరు?
 ఎవరి నెట్లు పూజించవలెనో, మరియు నేయే గ్రహ ఎట్టి ఫలమొసంగునో తెలియగోరితిని.
 కావున మీరు చక్కాగా విచారించి నానతీయుడు. అనిన యచట గూర్చున్న 
వారిలో నొకరొకరుగా పండితులు ముందునకు వచ్చి ఇట్లు పలికిరి.
    

First 1 2 3 4 5 6 7 8  Last

No comments:

Post a Comment