Friday, March 14, 2014

శివ గీత10




పంచ భూతాత్మ కంబైన శరీరములం దంతటను పరమ శివుడు
 ( ఆత్మ రూపమున ) వ్యాపించి యున్నాడు. గృహ నిర్మాణ
 సమయమున వాటిని విడిచి యాకాశ ముండదు,
కాని అవి దహింప బడు నప్పుడే విధముగా నాకాశము
 దహింప బడదో అట్లే దేహము లందుండెడు ఆత్మ నశింపదు.
దేహములు నశించును.

హన్తా చే న్మన్యతే హస్తుం - హతశ్చే న్మన్యతే హతమ్ ?
తావు భౌన విజానీతో - నాయం హన్తి హన్యతే. 21
అస్మాన్న్రు పాతి దుఃఖేన - కిం ఖేద స్యాస్తి కారణమ్,
స్వస్వరూపం విదిత్వేదం - దుఃఖం త్యక్త్యా సుఖీభవ 22
ప్రపంచము నందు ఒక వ్యక్తి మరొక వ్యక్తిని కొట్టినచో వాడిని
 కొట్టి వాడని కాని అట్లు కొట్టబడిన వ్యక్తి దెబ్బల కోర్చిన వ్యక్తిని  కాని,
 ఇట్లు కొట్టిన వాడు కొట్టబడిన వాడు
ఈ యుభయులలో నే ఒక్కరు కర్తలు గారు.
 కావున ఓ రామా! ఇందులకై శోకింప బని లేదు.
నీ యాత్మ స్వరూపమును గనుకొని దుఃఖమును
 మాని నిత్య సుఖివి గమ్ము.

శ్రీ రామ ఉవాచ :-
మునే! దేహస్య ణో దుఃఖం - నైవ చేత్పర మాత్మనః,
సీతా వియోగ దుఃఖాగ్ని - ర్మాం భస్మీ కురుతే కధమ్ ? 23
సదాను భూయతే యోర్త - స్సనా స్తీతి త్వయే రితః,
జాయతాం తత్ర విశ్వాసః - కధం మే ముని పుంగవ ! 24
రాముడు నివేదించు కొను చున్నాడు: ఓయీ ముని పుంగవా!
 పరమాత్మకును శరీరమునకు వ్యధ లేదని మీరాదేశించితిరి.
అటులైన యెడల సీత ఎడబాటుతో నుప్పతిలు దుఃఖము
మదన బాణాగ్ని నన్ను గాల్చి భస్మావ శేషము గావించు చున్నది.
 నిరంతర మేది యనుభవింప బడుచున్నదో
 ఆ విధమైనది మిధ్యయని నిరూపించితిరి,
అద్దానిని గురించి నాకు విశ్వాస మెట్లు కలుగును?
నాకు తెలియ పరచుము.

అన్యిస్తి నాస్తికో భోక్తా - యేన జన్తు: ప్రతప్యాతే,
సుఖస్య వాపి దుఃఖస్య - తద్బ్రూహి ముని సత్తమ! 25
ఎట్టి. దుఃఖము వలన మనుష్యుడు బాధ చెందునో అట్టి దుఃఖము
 ననుభవించుటకు గాని, ఎట్టి సుఖము వలన సుఖము
ననుభవించునో అట్టి సుఖ దుఃఖముల ననుభవించు వాడొక్కడే
 బాధ్యుడు గాని యితరులు భోక్త లెట్లగుదురు
నాకు వివరింపుమో మనివర్యా !

దుర్జే యా శాంభవీ మాయా తయా సమ్మో హ్యతే జగత్,
మాయాంతు ప్రకృతిం విద్ధి - మాయినం తు మహేవ్వర మ్ 26


First 1 2 3 4 5 6 7 8 9  10 11 Last

No comments:

Post a Comment