అచటకులపర్వతములు లేవు. నదులు కూడాలేవు.
పున్యపుషులు దేవతలవలేనే వేషములు ధరించి వారితో సమానముగా నుందురు. అక్కడ
వర్ణాశ్రమాచారములు లేవు. వేసవికాలము, వర్షాకాలము, శీతాకాలము అను భేదములు ఉండవు.
ముసలితనము లేదు. అదియే స్వర్గమని పిలువబడును. అక్కడ నోకపెద్ద మర్రివృక్షము
గలదు. ఆచెట్టు మొదట బ్రహ్మ, తన నివాస మేర్పరుచుకొనెను. దీని చుట్టును
మంచినీళ్ళ సముద్రము ఆవరించి యుండును.
ప్రజలు వారు కోరినంతనే భోజనము
లభ్యమగుచుండును. నేలయంతయు బంగారు రూపమే. జంతువులు ప్రజలను బాధింపవు. దాని తరువాత
చక్రవాళ శైలము ఉన్నది. అది పదివేల యోజనముల పొడవు గలది. అది అంధకారములో
నుండును. అందుచే జనుల కది కనిపించదు.
క్రౌంచద్వీపము గాక, యితర ద్వీపములందలి సముద్రములకు
ఆటుపోటులుండును. శుక్లపక్ష కృష్ణ పక్షములందు చంద్రుని వృద్ధి
క్షయములను బట్టి ఇవియు వృద్ధి క్షయములను పొందును. క్రౌంచ ద్వీపమును
జుట్టియున్న సముద్రమునకు అటువంటి ఆటుపోటులు లేవు.
ఈ విధముగా సప్తద్వీపములతో గూడిన
భూమండలము కొలత ఏబదికోట్ల యోజనము లుండును. ఆ భూమియే సర్వప్రజలకును, జంతుజాలమునకును నదీనదారణ్య
సముద్రాలకును ఆధారమని గ్రహింపవలయును. అని సూతుడు
చెప్పగా విని మునులందరూ సంతోషపరవశులైరి.
రుద్రమహత్యము -గౌరీ శంకరులు
సూతుడు మరల నిట్లు చెప్పసాగెను.
మునులారా! ఈశ్వరుని మహిమ ఇంతయని చెప్పలేము. ఆయనను గూర్చి చెప్పెదను వినుడు.
పరమేశ్వరుడు దక్షప్రజాపతి కుమార్తె యైన
సతీదేవిని వివాహమాడెను. ఇతడు, మిగిలిన తన అల్లుండ్ర వలె సంపన్నుడు కాదని
దక్షునికొక చిన్నచూపు. ఒకమారు యజ్ఞము చేయుచు సతీదేవిని దప్ప మిగిలిన
కుమార్తెలను పిలిచి, వారికి వస్త్రములు, ఆభరణములు కోరినవి యిచ్చి సంతోషపరచెను. ఈ
విషయము సతీదేవికి తెలిసెను. వెంటనే ఆమె తండ్రి యింటికి పిలువకుండనే
వెళ్ళెను. దక్షుడామెను పలుకరించలేదు. సతీదేవికి రోషము గలిగి, "తండ్రీ! నేను కుమార్తెలలోని కెల్ల
పెద్దదానను. నన్ను ఇంతమంది ముందు చులకనచేయుట యుక్తము
కాదు" అనగా దక్షుడు కోపముతో " నాపుత్రిక లందరును గణవతులు, ఆల్లుండ్రు కొందరు తపోనిష్టలు, కొందరు మహైశ్వర్య సంపన్నులు. నాయందు గౌరవభావము
గలవారు. నీభర్త అయోగ్యుడు. నన్ను గౌరవింపడు, నమస్కరించడు; తక్కినవారితో నైనా సఖ్యముగా
నుండడు. అటువంటి శివునితో సంబంధ మున్నందున నీవుకూడా నాకు
అనిష్టురాలవైతివి" అనెను. అది విని సతి "నీవు, మహోన్నతుడను, పరమపురుషుడైన నాభార్తను నన్నును
దూషించితివి. కావున నీవలన జన్మించిన ఈ దేహమును ఇఒప్పుడే
విడుచుచున్నాను" అనుచు, "నేనెప్పుడును సతీత్వ ధర్మమును నాశ్రయించి యుంటినేని
మరలా నాకు శంకరుడే పతియవు గాక" అని భారత్ను మనసులో ధ్యానించుచు తన శరీరమును
యోగాగ్నిలో భస్మము చేసెను.
No comments:
Post a Comment