Thursday, March 13, 2014

శ్రీ బ్రహ్మ వైవర్త పురాణము32




బ్రాహ్మణులకు దక్షిణ ఇచ్చుట : బ్రాహ్మణుల చేత వ్రతములు ,పూజలు ,అభిషేకములు , వివాహొపనయనాది కర్మములు చేయించుకున్న వెంటనే ,నిర్ణయించుకున్న (లేదా సంకల్పించు కొనిన ) దక్షిణ నిచ్చి వేయవలెను. అట్లు ఇయ్యని ఎడల ,రెండు గడియలు దాటినచో ఆ దక్షిణ రెట్టింపు అగును. ఒక దినము గడచినచో నాలుగు రెట్లగును. ఒక పక్షము దాటినచో నూరు రెట్లగును. ఒక నెల దాటినచో అయిదు వందల రెట్లగును. ఆరు నెలలు దాటినచో దీనికి నాలుగు రెట్లగును . ఒక సంవత్సరము దాటినచో ఆ వ్రత పూజాది కర్మలు నిష్పలము లగుటయే కాక యజమాని కాల సూత్రము అను నరకములో ఒక బ్రహ్మ కల్పము దాక కష్టము లనుభవించును .
ధర్మ నిర్ణయము : కేవలము వేద ధర్మములను ,శాస్త్ర ధర్మములను అనుసరించి ధర్మ నిర్ణయము చేయరాదు. వేద శాస్త్రముల కన్నను లౌకికాచారము బలవత్తర మైనది కావున దానిని విడిచి పెట్టరాదు .
(కేవలం వేద మాశ్రిత్య కః కరోతి వినిర్జయమ్?
బలవాన్ లౌకికో వేదాత్ లోకాచారం చ కస్త్య జేత్ ?)

                                              ఇది బ్రహ్మ వైవర్త పురాణ సంగ్రహము
  శ్రీరస్తు


 First   16 17 18 19  20  21  22  23  24  25  26  27  28  29  30  31 Last

No comments:

Post a Comment