Thursday, March 27, 2014

శ్రీ రామ కధ పూజా విదానం -3




అప్పుడు నారాయణ భట్టు 'నేను నీకు రాముల వారి కధను చెప్పెదను ,రాముల వారికి పూజను చేసి , 
ఈ కధను చదువు కొనమ'నెను. ఇది చేసినచో నీ భర్త తిరిగి వచ్చును .నీ కుమారుడు రాజగును అని పలికెను. 
ఆమె ఒప్పుకొనిన తరువాత ఆ వూరి రాజు హఠాత్తుగా చని పోయెను. 
రాజ్యము కొరకు ప్రజలు పోట్లాడు కొనుచున్న సమయములో ఆమె కుమారుడు జోలి వేసుకొని వచ్చు చుండెను.
 ఆ ఊరి ప్రజలు రాజును ఎన్ను కొనుటకై పట్టపు టేనుగును అలంకరించి ,
 ఇష్టము వచ్చిన వారి మెడలో పూలహారము వేయమని పంపిరి .
 ఆ సమయములో అటు వచ్చు చున్న ఆమె కుమారుని మెడలో ఆ ఏనుగు పూలహారము వేసి ,
 అతనిని తీసుకు వచ్చి సింహాసనము పై కూర్చుండ బెట్టెను .  
ఇంతలో కాశీ నుండి ఆమె భర్త కూడా తిరిగి వచ్చెను. 
పిల్లవాడి తల్లి దండ్రుల కొరకు పల్లకీ పంపిరి .తల్లి దండ్రులు వచ్చి నమస్కరించిరి .
అప్పుడు తల్లి ,అయ్యా ! ఎవరో బ్రాహ్మణుడు మనకు రాముల వారి కధను ఉపదేశించెను
 అందువల్లనే మనకింత భాగ్యము కలిగెను అని చెప్పి ,అప్పటి నుండి మరువక
 వారు రాముల వారిని పూజ చేయు చుండిరి.
నారాయణ భట్టు వెడుతూ వెడుతూ అలసి పోయి ఒక మర్రి చెట్టు క్రింద పరుండెను .
ముసలి బ్రాహ్మణ రూపంలో రాములవారు కనబడి ,'నీవెవడవు ?
 పులులు, సింహములు సంచరించు అడవిలో ఒంటరిగా ఎందుకున్నావు ?
' అని అడుగగా ,'నా పేరు నారాయణ భట్టు .నేను రాములవారిని చూడ బోవుచున్నాను .
అయినా నా సంగతి మీకెందుకు ?' అని అనెను. '
 నేనే రాముడను ' అని ముదుసలి అనెను. రాముదవని నీకేమి గుర్తు? అని అడుగగా , 
శంఖ చక్ర పీతాంబర ధారియై ,కోదండ పాణి ధారుడై సీతా సమేతముగా రాములవారు ప్రత్యక్ష మైరి.
నారాయణ భట్టు చేరువలో నున్న చెరువులో స్నానము చేసి రాముల వారికి
 ప్రదక్షిణ నమస్కారములు చేసి ,'రామా ! నాకు దర్శన మిచ్చితివి .
అట్లే నా తల్లి దండ్రులకు కూడా నీ దర్శనము ఇయ్య గోరెదను.' అని పలికెను.
 'నేను భక్త పరాదీనుడను ,భక్తుల యిండ్లనే నివసింతును ' అని రాముల వారు పలికిరి. 
 ఇంటికి వెళ్ళు సరికి ధన ధాన్యములు ఎప్పటి వలె తుల తూగు చుండెను.
 తల్లి దండ్రులు అతనికై ఎదురు చూచు చుండిరి .వారితో రాముల వారు వస్తున్నారు అని చెప్పెను. 
వారు పట్టణ మంతయు అలంకరించి ,ముత్యాల ముగ్గులు పెట్టి ,రత్నాల తోరణములు కట్టి, వెండి పీటలు ,
 బంగారు పీటలు వేసి ,ఏనుగు మీద శృంగారించి ,అరటి స్థంబములు కట్టి ,మామిడి తోరణములు కట్టి ,
 పంచ భక్ష్య పరమాన్నములతో నైవేద్యము చేసి రాముల వారిని సీతా సమేతంగా ఊరేగించి ,
 మంగళ హారతు లిచ్చి సకలోపచారములతో పూజ చేసిరి. 
ఋషులు కేశవ భట్టుకు చీప్పిన కధను కేశవ భట్టు నారాయణ భట్టు కు చెప్పెను.
 నారాయణ భట్టు దేశమంతా చెప్పిన కధ మనము చెప్పు కుంటున్నాము .
కావున ఓ రామ చంద్రా ! కేశవ భట్టు ,నారాయణ భట్టు ఇంట ఉన్నట్లే మా యింత ఉండి మమ్ము రక్షింపుము.
శ్రీ రామ శ్లోకము
వైదేహి సహితం సురద్రు మతలే హైమే మహా మంటపే
మధ్యే పుష్పక మానసే మని మయే విరాసనే సుస్తితం |
అగ్రే వాచ యతి ప్రభంజన సుతం తత్వం మునిభ్యః
పరం వ్యాఖ్యాంతం భరతా భి భి: పరి వృతం రామం భజే శ్యామలం ||
                                           || శ్రీ రామ జయం ఓం ఓం ఓం ||


No comments:

Post a Comment