బంగారు వర్ణము గలది లేత గరిక మా వి శ్యామ లయ,
బిగువు చనుదోయి (కలశ స్తనములు) గలది .
దొండ పండు వంటి క్రింది పెదవి గలది.
ఇందు ముఖియు మున్నగు విశేష నామములతో కూడిన
యువతులు క్రీగంటి చూపుల వలన నూ పూవిలు కాని నుండి
దప్పించి కాపాడు నని ఎవ్వడైతే తలచునో అట్టి అవివేకి మన్మధుని
చేత శిక్షింప బడి న వాడే యగును.
తస్యా వివేకం వక్ష్యామి - శృణుష్వా వహితో నృప
నచ స్త్రీ పుమానేష - న చైవాయం నపుంసకః 14
అమూర్తః పురుషః పూర్ణో - ద్రష్ట్రా సాక్షీ సజీవనః
యాతన్వంగీ మృదుర్బాలా - మల పిండాత్మికా జడా 15
అటువంటి వాడి వివేకము ఎట్టిదో దానిని గురించి వివరించు చున్నాను.
శ్రద్ధతో వినుము. పరమాత్ముడు స్త్రీ, పురుష ,నపుంసకముల కతీత మైన వాడు.
మూర్తిత్వర హితుడు, సర్వాంతర్యామి, సమస్తమునకు సాక్షి భూతుడు,
సర్వాపేక్షకుడు, సమస్త జీవితము కూడా అగును.
సాన పశ్యతి యత్కిం చిన్న - శ్రణో తిన జిఘ్రతి,
చర్మ మాత్రా తను స్త సయా- బుద్ధ్యా వీక్ష స్వరాఘవ! 16
యా ప్రాణ దదికా సైవ- హస్తతే స్యా ద్ఘ్రుణా స్పదమ్,
జాయన్తే యది భూతేభ్యో - దేహినః పాంచ భైతికాః 17
సున్నితము, కోమలమైన యుపాంగములు (అవయములు ) కలిగి,
మల మూత్ర పిండాత్మకము, జడదేహము గలది యునైన
ఎవనిత యనబడినదై, ఇతరులను జూడదు, వినదు,
వాసన కూడా చూడదు.
ఓ రామా! వివేక జ్ఞానముతో నొక పరి దర్శింపుము.
నీవు దేనినైతే నీ ప్రాణము కంటెను మిన్నగాను,
ప్రేమకు పాత్రమైనది గాను దల పోయు చుంటివో అట్టి
శరీరము తోలు తిత్తి మాత్రమే. హేయాస్పద మైనది.
దానిని నీవు ప్రేమింప దగదు.
ఆత్మా యదే కలస్తేషు - పరి పూర్ణ స్సనాతనః,
కాకాన్తా తత్ర కః కాన్త - స్సర్వ ఏవ సహోదరా 18
నిర్మితాయాం గృహావల్యం - తద వచ్చిన్న తాం గతమ్,
నభస్త స్యాం తు దగ్దాయాం - న కాంచి తక్షతి మృచ్చతి 19
తద్వ దాత్మా పి దేహేషు - పరి పూర్ణ స్సనాతనః,
హన్య మానే షు తేశ్వేవ - స్వయం నైవ హి హన్యతే 20
No comments:
Post a Comment