యత్రాస్య రమతే చిత్తం - తత్ర ధ్యానేన కేవలమ్ 32
స్వాత్మ త్వేన శివస్యాసౌ - శివ సాయుజ్య మాప్నుయాత్ .
అసలు విషయమేమనగా - ఎవడైతే అనేక జన్మముల నుండి
పాప కర్మముల చేసి మూట గట్టుకుని యున్నాడో అట్టి పపిష్టు నకు
జ్ఞాన శూన్యునికి, ఈ శైవ తత్వము నచ్చదు.
ఇట్టి సులభైక ఉపాస్యుడైన శివుని సేవించుటకు ఇట్టి సమయమని కాని,
ఇట్టి స్థలమని కాని, ఇట్టి ప్రదేశమని గాని నిర్ణయము లేదు.
ఎట్టి సమయ మందైనను ఏ కాలము, ఏ దైవ మందై నను మనస్సు
సుప్రసన్నముగా నుండునో అదే సమయంబున ఆయా స్థలము
లందే తన హృదయమున పరమ శివుని ధ్యానించి నట్లైతే అట్టి
నిర్మల మనస్సు గల మానవునకు సాక్షాత్తుగా కైలాస ప్రాప్తి కలుగుటలో
సందేహము లేదు. అనగా సంశయింప నవసరము లేదు.
అతి స్వల్పత రాయుశ్శ్రీ - ర్భూతే శాంశాధి పోపియః,
సతు రాజా హమస్మీతి - వాది నం హన్తి స్వాన్వయమ్. 33
కర్తాపి సర్వ లోకానా - మక్ష యైశ్వర్య వానపి,
శివ శ్శివో హమ స్మీతి - వాది నం యం చ కంచన 34
ఎట్టి మహేశాం శమున బుట్టిన వాడైనను, " నేనే ప్రభువును "
అనే అహంభావము ఎవనిలో ఉండునో అట్టి వానికి ఆయువు క్షీణిం
చుటే కాకుండా నిర్వంశ మగుటకు మూలమగును.
కావున మూడు లోకములకు ప్రభువైన ప్పటికి ఐశ్వర్య వంతుడైనను
దురభిమానమునకు లోను గాక శివో హం భావముతో నుండిన
అధవా దాసోహం భావంతో నుండి నను ఆ పర శివ మూర్తి మిక్కిలి
ప్రసన్నుం డై తనలో ఐక్య మొనర్చు కొనును.
ఆత్మనా సహ తాదాత్మ్య - భాగినం కురుతే బృశమ్,
ధర్మార్ధ కామ మోక్షాణాం - పారం యాస్యన్తి యేన వై .35
మునయస్త త్ప్ర వక్ష్యామి - వ్రతం పాశు పతాభిదమ్,
కృత్వాతు విరజాం దీక్షాం - భూతి రుద్రాక్ష దారిణః 36
జపంతో వేద సారాఖ్యం శివ నామ సహస్రకమ్,
సంత్య జ్యతేన మర్త్యత్వం శేవీం తను మవాప్య . 37
ఓయి ! (ఋషి) మునివరులారా ! తొల్లి మునీశ్వరులే ఆచరించి; ధర్మము,
అధర్మము ,కామము మరియు మోక్షమనెడు చతుర్విధము
లగు ఫల పురుషార్ధముల సారముల చక్కగా అవగతము చేసికొన్న
పాశుపత మనెడి వ్రతమునకు నీకు వివరించెదను వినుడు.
మీరు కూడా నేను వివరించిన విధముగా విరజా దీక్షను బొంది, విభూతి,
No comments:
Post a Comment