శ్రీ బ్రహ్మ వైవర్త పురాణము19
స్వకర్మ చేతనే ఇంద్రుడైనను,హరిభక్తుడైనను, బ్రాహ్మణు డైనను ,సజ్జను డైనను ,దుర్జను డైనను ,జంతు వైనను ,పక్షి యైనను అగుచున్నాడు. పండితు
డైనను ,పామరుడైనను స్వకర్మ చేతనే యగుచున్నాడు. నీ
వింక రావలదు.నీ ఇష్టము వచ్చిన చోటికి పొమ్ము " అనగా సావిత్రి " ఓ ధర్మరాజా
! నీవంటి మహా జ్ఞానివి ,నా భర్తను విడిచి పెట్టి నేనెక్కడకు పోగలను ? నాకు నీవు ఏ కర్మలు చేసిన ఏయే
జన్మములు కలుగునో, పుణ్య పాపములనగా నేట్టివో అన్నియు
వివరముగా చెప్పుమని అడిగి, అన్నియు చెప్పించు కొనెను . యముడు
" వరమిచ్చెదను , నీ పతి ప్రాణములు తప్ప ఇతర మేమైనా కోరుము " అనగా
ఆమె తన తండ్రికి ,నూరుగురు పుత్రులు కలుగవలెననియు ,మామ గారికి అంధత్వము పోయి రాజ్య
లాభము కలుగ వలెననియు వరమడిగెను. యముడు ఆ వరమిచ్చెను .తరువాత సావిత్రి యమ
ధర్మరాజును వివిధ నరకములను గూర్చియు ,సృష్టి స్థితి లయములను గూర్చియు ,సర్వ ప్రభుడైన శ్రీ కృష్ణ
భగవానుని గూర్చియు చెప్పుమని యడుగగా యమధర్మరాజు ఆమెకు అన్నియు వివరించి ,వయసులో చిన్నదైనను ఆమె ధర్మ బుద్దికి
పాతివ్రత్యమునకు ను మెచ్చుకుని ఆమె భర్తను తిరిగి జీవింప చేసి తాను సంయమనీ
నగరమునకు బోయెను. సావిత్రి భర్తతో సహా స్వగృహము నకు జేరెను. జరిగిన
విషయములు భర్తకును అత్త మామలకును చెప్పెను .ఆశ్వపతికి నూరుగురు పుత్రులు
పుట్టిరి . ద్యుమత్సేన దంపతులకు చూపు వచ్చెను. వెంటనే దాయాదు
లాక్రమించిన రాజ్యము కూడా చేతికి వచ్చెను. సామాన్యులకు యముడు కనిపించడు.
ఆయనను జూచి ,ఆయనతో ధర్మ ప్రసంగములు చేసి మెప్పు నొంది తన భర్తను
బహుమానముగా తిరిగి తెచ్చుకున్న సావిత్రి వంటి మహా పతివ్రతలు మన భారతీయ స్త్రీల
కందరికిని ఆదర్శప్రాయులు కదా !
No comments:
Post a Comment