నాలుగవ పండితుడు
ప్రభువరేణ్యా బుధుడు చాలా బలవంతుడు.
ఆయన ప్రతాపము
గూడా అద్భుతమైనది.
సర్వగ్రహములకు శిరోమణి వంటివాడు.
ఆయనను పూజించి
ఏకార్యమాచరించిననూ నిర్విఘ్నముగా నెరవేరును.
సర్వానందము ప్రాప్తించును.
బుదుడెవనిపై ప్రసన్నుడగునో నాతడైశ్వర్య వంతుడగును.
ఈవిధముగా బుధుడు
పరోపకారియని తెలియవలెను.
బుధుడుడెవనికైతే నుచ్చస్థానమందుండునో నాతనికి సర్వమనుకూలము గానే
యుండును.
బుధునియొక్క బుద్ధి చాలా గొప్పది.
ఎవరితోనైననూ నిష్టురములు
గర్పింపడు.
సంసార చింతనము గలుగ జేయడు, కావున బుధుడే గొప్పయని చెప్పి
గూర్చుండెను.
వేరొక పండితుడు లేచి రాజుతో ఇట్లు పలికెను.
అయిదవ పండితుడు:-
జననాయకా! గురుడందరికంటే పెద్దవాడు. గురునియొక్క సామర్ధ్యము గొప్పది.
గురుని
యాజ్ఞ ఇంద్రాది దేవతలు కూడా శిరసావహింతురు.
గురుజ్ఞాన మెవ్వరికిని తెలియదు.
కరుణాసాగరుడు, భక్తులయొక్క కర్మ
పుంజములను
త్రెంచివేసి భవసాగరము నుండి తరింపజేయును.
గురుని స్మరించిన మాత్రమున
దుఃఖము దూరమగును దారిద్ర్యము
తొలగిపోవును, రోగములు విదిపోవును.
గురుదే
నవగ్రహములలో శ్రేష్టుడు. గురుడు బ్రాహ్మణ
జాతికి జెందినవాడు.
గురువాక్యమునందరు సమ్మతించెదరు. గురుడు
జ్ఞానసాగరుడు, సాటిలేనివాడు.
ఆయన ఎదుట ఎవ్వరును పనికిరారు.
కావున గురుని పూజించుటచే సర్వగ్రహములు సంతోషించును.
సాక్షాత్ శ్రీశంకరుడే గురుని పూజించుచుండ
నితరులు లెక్కఏమి?
కావున
సర్వగ్రహములలో గురువే
పూజ్యుడు అని యూరకుండగా
మరొక శాస్త్రజ్ఞుడు ఇటుల పలికెను.
No comments:
Post a Comment