ఈ పై మూడు వర్ణములు వారికిని ఉపనయనాధి కారముకలదు.
శూద్రులు ఈ పై మూడు వర్ణముల వారు చేయు కార్యాములలో సహకరించుచు వారి శక్తి యుక్తులను అందించు చుండవలెను.
ఇంక ఆశ్రమములు: ఇవి నాలుగు. బ్రహ్మచర్యము, గార్హ స్థ్యము, వాన ప్రస్థము, సన్యాసము.
బ్రహ్మచర్య,
గార్హస్థ్య, వానప్రస్థములు మూడును బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు సమానములు.
సన్యాసము తప్పమిగిలినవి శూద్రులకు కూడ ఆచరణీయములే.
బ్రహ్మచర్యము: గురుకులవాసము చేసి యితర ఆలోచనలు మాని విద్యాభాసము చేయుట, నియమ నిష్ఠలతో నుండుటకు అలవాటు చేసికొనుట దీనియందు జరగవలెను.
గార్హస్థ్యము(గృహస్థాశ్రమము): విద్యాభ్యాసము
పూర్తి యైన తరువాత తనకు తగిన కన్యను పెండ్లాడి గృహస్థుడు కావలెను.
మనుష్యయజ్ఞము, భూతయజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము అను పంచమహా యజ్ఞము
లాచరించుచు దేవ, పితృ, మనుష్య, భూతములకు సంతృప్తిగా పెట్టుచు, చదివిన వేద
శాస్త్రములను (ఇతర విషయములను గూడ) తిరిగి వల్లె వేయుచుండ వలెను. ఇంటికి
వచ్చిన అతిధి అభ్యాగతుల నాదరించుచు, బంధువులను సంతోష పరచు చుండవలెను. గోసేవ
చేయవలెను. స్నాన సంధ్యావందనములు, అగ్నిహొత్రములు, పితృ తర్పణములు చేసి,
నిత్యకర్మల నిట్లు జరుపుచుండెను. నైమిత్తికములను (తల్లి దండ్రులకు
శ్రాద్దములు పెట్టుట మొ||) శ్రద్దా భక్తులతో ఆచరించవలెను. పుత్ర పుత్రికలను
విద్యాభ్యాసములు వివాహాదులు జరి పంచవలెను. గృహస్థాశ్రమమునకు ఫలము సంతానమే
గదా! దాని వలన వంశ వృద్దియగును.
No comments:
Post a Comment