సావిత్ర్యు పాఖ్యానము
ఆశ్వపతి యను రాజు ధర్మాత్ముడు .అతడు సావిత్రీ దేవి నుపాసించెను .ఆమె ప్రసన్నురాలై "రాజా ! నేను నీకు పుత్రికగా జన్మింతును. తరువాత పుత్ర సంతానము గలుగును." అని చెప్పి అద్రుశ్యు రాలయ్యెను. ఆశ్వపతికి కుమార్తె కలిగెను ఆమె సావిత్రీ రూపిణియే గనుక ఆమె కతడు సావిత్రి అను పేరు పెట్టెను . ఆమె శుక్ల పక్ష చంద్ర రేఖవలె పెరిగి పెద్దదయ్యెను. ద్యుమత్సేనుని కుమారుడైన సత్య వంతుని భర్తగా వరించెను తండ్రి కూడా ఆమోదించి ఆమెను సత్యవంతుని కిచ్చి పెండ్లి చేసెను. కొంతకాలము సాగిన తరువాత సత్యవంతుడు తండ్రి యాజ్ఞపై పండ్లు తెచ్చుటకు అడవికి బోయెను. దైవ వశాత్తు సావిత్రి కూడా అతని వెంట అడవికి వెళ్ళెను. సత్యవంతుడు కట్టెలు కొట్టుచు చెట్టు మీదినుండి పడెను. యముడు అతని జీవుని అంగుష్ఠ మాత్రుని (బొటన వ్రేలంత ) చేసి తీసికొని పోవుచుండెను.
("అంగుష్ఠ మాత్రః పురుషః " అని శృతి ) సావిత్రి యముని వెంట బడెను.యుము డామెను జూచి ,"అమ్మాయీ ! నీ వెక్కడికి వచ్చెదవు? మానవ శరీరముతో నా వెంట వచ్చుట సాధ్యము కాదు. నీవు రావలెన్నచో నీ భర్త వలె దేహత్యాగము చేసి రావలెను. నీ భర్తకు కాలము తీరినది .అందుచేత నేనీతనిని తీసికొను పోవుచున్నాను .స్వకర్మ ఫలము ననుభవించుటకే యితడు నాతో వచ్చు చున్నాడు .స్వకర్మ చేతనే ప్రాణులు పుట్టుచు చచ్చుచున్నవి .
No comments:
Post a Comment