Friday, March 28, 2014

శని మహాత్మ్యము -5





మొదటి పండితుడు
మహీపాలా! అన్ని గ్రహములలో సూర్యుడే శ్రేష్టుడు.
 ఏ నరుడైతే భక్తి పూర్వకముగా సూర్యభగవాను నారాధించునో
 యాతని విఘ్నములన్నియు దూరమగును.
 సూర్యదేవుని స్మరించినంత మాత్రమున ఆదివ్యాధులన్నియు తొలగిపోవును. 
సకల కోరికలు సిద్ధించును. సూర్యుడే ముఖ్య దైవము, 
 ఆయనను దప్పనితర దేవతలా గొనియాడుట వ్యర్ధము.
 మిగతా గ్రహములన్నియు సూర్యదేవుని యాజ్ఞను పరిపాలించెదరు. 
 సూర్యుని వంటి బలవంతుడు, తెజోవంతుడును నింకొకరులేరు.
 సూర్యుడే ప్రత్యక్ష దైవము, కావున నవగ్రహములలో సూర్యుడే శ్రేష్టుడు.
 అని యిటులనునంతలో రెండవ పండితుడు లేచి ఇటుల పలికెను.

రెండవ పండితుడు
గ్రహములన్నింటిలో చంద్రుడే శ్రేష్టుడు వనస్పతుల నన్నిటిని పోషించు వాడగుటచే చంద్రుడే పూజ్యుడు. 
సాక్షాత్ శంకరుడే తన మస్తకమునందాయనను ధరించెను.
 చంద్రుడ మృతమును వర్షించి సర్వదేవతలను తృప్తి పరచుచుండెను.
 మహారూప వంతుడు, పాడారు కళలచే వెలుగొందువాడు, ఆయన ఎవరిని లక్ష్య పెట్టువాడు కాడు.
 అందరికిని సౌఖ్యమొన గూర్చునాడు. నిర్మల హృదయుడు కావున 
ఆ సోముని పూజించువాడే ధన్యుడు అని పల్కిన మూడవ పండితుడు ముందుకు వచ్చి ఇటులనెను.         

మూడవ పండితుడు:-
భూమీశ్వరా ! నిశ్చిత మనస్కుండ వై వినుము. అన్ని గ్రహములలో కుజుడే గొప్పవాడు.
 ఆయన సామర్ధ్యమును వర్ణింపనెవరికిని తరము గాదు. కుజుడు కోపస్వభావము గలవాడు. 
 పదునైన ఘజ్గముతో సమానుడు. ఆయన మాహత్య మెవరికిని తెలియదు.
 అందరికంటెను గొప్పవాడు. ఆయన కులమున క్షత్రియుడు.
 ఎవ్వరైతే భక్తి పూర్వకముగా  నారాధింతురో వారిని క్రుపాపూర్ణడై సంరక్షించును.
 ఎవ్వరైతే గర్వపడి ఆయనను పూచించరో వారిపై 
కోపము జెంది వారి సర్వస్వమును నాశనము గావించును. 
అంతేగాక వారి ప్రాణములను దీయుటకు కూడా వెనుదీయడు.
 కావున సర్వగ్రహములలో కుజుడే శ్రేష్టుడని తెలియవలెను.
 అని కూర్చుండెను.



First 1 2 3 4 5 6 7 8  Last


No comments:

Post a Comment