కష్టములతో ఉన్నవారికి
ఈ కధను చదువు కొన్నచో కష్టములు పోయి సుఖముగా నుందురు.
పెండ్లి కాని వారికి పెండ్లి యగును . దరిద్రులు ధనవంతు లగుదురు .చెవిటి
వారికి చెవుడు పోవును .
గ్రుడ్డివారికి కండ్లు వచ్చును
.శరీరములో ఏ జాడ్య మున్నను పోవును.
శత్రువులు మిత్రులగుదురు.
పోయిన పదార్దములు చేతికి వచ్చును. తీర్ధ యాత్ర ప్రాప్తి కలుగును.
దైవ దర్శనము అగును. ఇహ లోక సౌఖ్యము
లన్నీ పొందిన తరువాత
వైకుంఠ ప్రాప్తి కలుగును.
నీవు అయిదు గురువారములు ,అయిదు
ఆదివారములు క్రమం
తప్పక సవా
శేరు గోధుమ పిండిలో తగినంత నెయ్యి ,చక్కెర
కలిపి అయిదు ఉండలను
చేసుకొని
శ్రీ రాముల వారికి సకలోప చారములతో పూజా చేసి ,నైవేద్యము చేయవలెను
.
నీవు ఇంటికి వెళ్లుమని చెప్పిరి.
కేశవ భట్టు ఇంటికి వెళ్ళు సరికి అతని ఇంట ధన ధాన్యములు తుల తూగు చుండెను.
కేశవ భట్టు ఇంటికి వెళ్ళు సరికి అతని ఇంట ధన ధాన్యములు తుల తూగు చుండెను.
అప్పటి నుండి
రాముల వారిని మరువ కుండ పూజ చేయుచుండెను .
కొంత కాలము అగుసరికి కేశవ భట్టు కాశీకి పోదలచెను. కుమారుడైన నారాయణ భట్టును పిలిచి ,
నేను కాశీకి
వెళ్ళు చుంటిని.
నీవు రాముల వారిని మరువ వద్దు ' అని
చెప్పెను .నారాయణ భట్టు స్నానము చేసి ,
మడి
కట్టుకొని రాములవారికి పూజ చేసి ,అతని తల్లిని కధ వినుటకు రమ్మనగా
ఆమె 'కధ వద్దు ,కారణము
వద్దు ముందు నీవు భోజనము చేసి
వెళ్ళు ' మనెను.
సాయంత్రమైన తరువాత మంగళ హారతు లిచ్చి తిరిగి అమ్మను పిలువగా ఆమె
'పాలు కాచి ,తోడు వేయవలెను ,బంగారు ,వెండి దాచవలెను ' అని చెప్పెను.
నారాయణ భట్టు ఈమెకు దరిద్ర కాలము సంభవించు చున్నదని
తలచి పరుండెను .
తెల్లవారు సరికి ధన
దాన్యములన్నీ దొంగలు అపహరించిరి.
తినుటకు కూడా ఏమియు
లేకుండెను .
ఇదంతయు రాముల వారి మహిమ అని తలచి నారాయణ భట్టు ఎలుక కన్నములో
ఒక రాగి చెంబు దొరకగా దానిని తీసి ,యాయ వారము చేసి వచ్చి ,
గంజి కాచి ,దొన్నెలు కుట్టి
వాటిలో పోసి తానును ,పిల్లలు
త్రాగుచు కాలము గడుపు చుండిరి.
కొంత కాలమైన తరువాత కేశవా భట్టు కాశీ నుండి తిరిగి వచ్చి ఇదంతయు ఏమి అనెను.
నారాయణ భట్టు తండ్రితో నేను రాముల వారిని మరువ లేదు
.
అమ్మ కధ వినలేదు, హారతి తీసికొనలేదు అందులకే మనకీ గతి ప్రాప్తించి నాదని ,
నేను ఇక రాముల వారి
దర్శన మైతే గాని నీరైనను త్రాగనని తండ్రితో
చెప్పి చెల్లిలిని తీసుకొని ఎవరి కైనను కన్యాదానము చేయవలెనని పోవుచుండ పోవుచుండెను.
అట్లు పోవుచుండగా త్రోవలో ఒక
బ్రాహ్మణుడు ఎదురయ్యెను.
అతనిని చూచి
,'విప్రుడా నా చెల్లిలిని కన్యాదానము చేస్తాను ,చేసుకుంటావా ?
' అని అడుగగా
అతడు 'నాకు అక్కరలేదు 'అనెను.
మరి కొంత దూరము పోగా కొందరు ఋషులు కనబడిరి.
వారిని చూచి 'ఋషులారా నా చెల్లిలిని
కన్యాదానము చేస్తాను చేసుకొంటారా ?' అని
అడిగెను.
అందులో ఒకరు యితని
చెల్లిలిని గాంధర్వ వివాహము చేసుకొనెను .
నారాయణ భట్టు మరల పోవుచుండగా ఒక తులసికోట వద్ద ఒక తల్లి విచారముగా కూర్చొని యుండెను.
'అమ్మా !ఎందులకు విచారముగా
ఉన్నావు?' అని అడుగగా ,నా భర్త
కాశీకి వెళ్ళెను .
నా కుమారుడు మధుకరము
తెచ్చుటకై వెళ్లి ,తిరిగి
రాలేదు అనెను.
No comments:
Post a Comment