Wednesday, March 19, 2014

శ్రీ మత్స్య పురాణము5




చదువు కొందునని వచ్చిన వానిని అతడు, కాదు పొమ్మనుడు" అని బోధింపగా కచుడు శుక్రుని యాశ్రమమునకు
వెళ్లి సవినయముగా నమస్కరించి ,తనకు విద్యాదానము చేయుమని ప్రార్ధించెను.బృహస్పతి యంత వాని కుమారునకు చదువు చెప్పుట తనకు మహా గౌరవ మని భావించిన శుక్రుడు, అతనిని శిష్యునిగా అంగీకరించెను .కచుడు చాలా సౌందర్యము గలవాడు .వినయ విధేయతలు కలవాడు .గురువును ,గురువుగారి కుమార్తె దేవయానియు ఏపని చెప్పినను ,భక్తి శ్రద్దలతో చేయు చుండెడి వాడు. దేవయానికి అతనిపై ఇష్టము ఏర్పడినది .
శుక్రా చార్యుడు ,దేవగురువైన బృహస్పతి కుమారునికి విద్యలు బోధించు చుండుట ,రాక్షసులకు కంట గింపైనది .శుక్రుని కాదన లేరు అందుచేత కచుని మత్తు పెట్టినచో తమ కోరిక తీరునని యోచించి యొకనాడు ,గోవులను గాచుటకు అడవికి వెళ్ళిన కచుని చంపి ,ఒక చెట్టునకు వ్రేలాడ గట్టి పోయిరి. సాయంకాలము గోవులు అలవాటు ప్రకారము ఆశ్రమమునకు వచ్చినవి .కచుడు రాలేదు . దేవయాని చాలా సేపు ఎదురు చూసి ,తండ్రితో "గోవులు వచ్చినవి కాని ,గోవులను కాచుటకు వానితో వెళ్ళిన కచుడు రాలేదని " దీనముగా చెప్పెను. అది చూచి శుక్రుడు తన దివ్య దృష్టితో చూచి ,రాక్షసులు చంపిన కచుని బ్రతికించెను . అతడు ఆశ్రమమునకు వచ్చెను. కొంతకాలము గడచినది .కచుని చంపి పారవేసినచో శుక్రాచార్యుడు బ్రతికించును . గనుక ,కాల్చి బూడిద చేసి శుక్రుడు త్రాగెడి కల్లులో కలిపి యిచ్చినచో పీడ విరుగుడ యగునని రాక్షసు లందరును మంతనములు చేసిరి . ఒకనాడు గోవులను కాచుటకు అడవికి వెళ్ళిన కచుని బలవంతముగా చంపి, కాల్చి బూడిద చేసి కల్లులో గలిపి ,మాయమాటలు చెప్పి ,శుక్రుని చేత త్రాగించిరి . శుక్రునికి మద్యపానము చేయుటన్న చాలా ఇష్టము .రాక్షసులు చెప్పుచున్న మెచ్చుకోలు మాటలు వినుచు ఎప్పుడును త్రాగెడి దాని కన్నను మితిమీరి త్రాగెను. మైకముతో పడి ఉండెను.
సూర్యు డస్తమించెను . ఆశ్రమమునకు గోవులు వచ్చినవి తన కిష్ట సఖుడైన కచుడు రాలేదు. అందువలన దేవయాని చాలా విచారించుచు తన తండ్రి దగ్గరకు బోయి కచుడు రాలేదని చెప్పి యేడ్చేను. అతడు సురాపానముచే ఒడలు తెలియ కుండి మాటాడలేదు .దేవయాని యేడుపు ఎక్కువయ్యెను. అదివిని కొంత సేపటికి కొంత తెలివి తెచ్చుకుని ,"అమ్మా ! రాక్షసులు కచుని మీద పగ పట్టినారు. ఇప్పుడు బ్రతికించి నను మరల చంపరను నిశ్చయము లేదు. అతడు చచ్చి ధన్యుడైనాడు .పోనిమ్ము " అనెను. దేవయాని పట్టిన పట్టు విడువక కచుని బ్రతికించి తెమ్మని యేడ్చు చుండెను. శుక్రునికి మత్తు వదలినది . దివ్య దృష్టిని ప్రసరింప జేసి భూమండలముల లోను ,పదునాలుగు లోకములలో ను గూడ చూచెను. ఎక్కడను కచుని జాడ కనిపించ లేదు. రాక్షసుల వైపు దృష్టి మరలింప గా వారు చేసిన మోసము తెలిసి వచ్చెను . కచుడు తన కడుపులో బూడిద రూపములో ఉన్నాడు .మృత సంజీవనీ విద్యను ప్రయోగించి కచుని బయటకు రమ్మని పిలిచెను. కచుడు ,"గురుదేవా !నమస్కారము .నేను మీ ఉదరము చీల్చుకుని వచ్చిన యెడల మీరు మరణింతురు .మిమ్ములను బ్రతికించు సాధనము నా దగ్గర లేదు .నాకు గురు హత్యా పాతకమును ,బ్రహ్మ హత్యా పాతకమును గూడా కలుగును. మీరు నాకు

No comments:

Post a Comment