నవవిధ భక్తులు-సిద్దులు
శివుడు శ్రీ కృష్ణునితో నిట్లనెను ." మహాత్మా ! నే నిప్పుడీ ప్రకృతి రూపిణియైన దుర్గను స్వీకరింప జాలను. సంసారములో బదినచో నీ భక్తికి దూర మగుదును. సంసారము మహా మోహముతో నిండి యుండును . దానిలో బడిన వారికి ,జ్ఞానము, సద్భుద్ది , యోగము నశించును . అది విషయ భోగములను ,కోరికలను వృద్ది చేసి నీ పద పద్మ సేవకు దూరము చేయును. స్మరణము ,కీర్తనము ,గుణ శ్రవణము,జపము ,దైవరూప ధ్యానము ,పాదసేవ , అభివందనము ,ఆత్మ సమర్పణము ,నిత్యము నైవేద్యము చేసిన ప్రసాదమును దినుట అను నవ విధ భక్తులను నాకు అనుగ్ర హింపుము. సార్ ష్టి (సమాన ప్రాభవము లేక ఐశ్వర్యము ), సాలోక్య (సమాన లో మున నుండుట ) ,సారూప్య (సమాన రూపముతో నుండుట ), సామీప్య ,సామ్య లీనత (సమానుడగు దైవములో ఐక్య మగుట ) అను షడ్విధ ముక్తులను ,అంతేకాదు ,అణిమ(అణు రూపము ధరించుట ) ,లఘిమ (కాశ గమనముతో సర్వలోక సంచారము చేయు శక్తి ) ,ప్రాప్తి (తాను కోరిన వస్తువులను పొందెడి శక్తి ), ప్రాకామ్యము (కోరిన వస్తువులను అనుభవించి నను పాపము లంటని శక్తి ), మహిమ ( దుర్లభమైన దానిని గూడ పొందగల ఆకర్షణ శక్తి లేదా పెద్ద యాకారము ధరింప గల శక్తి ), ఈశిత్వము (అన్నిటి మీద ఆధిపత్యము ) వశిత్వము (సర్వలోకములను తన చెప్పుచేతల లోనికి దెచ్చు కొను శక్తి ) ,సర్వ కామావ సాయిత (అన్ని కోరికలను పొందిన పూర్ణ స్థితి ) ,సర్వజ్ఞత్వము (జగత్తులోని అన్ని విషయములు భూత భవిష్య ద్వర్త మానములు తెలిసియుండుట ) ,దూర శ్రవణము (తనకు అతి దూరమున నుండు శబ్దములు విను శక్తి ) ,పరకాయ ప్రవేశము (ఇతరుల శరీరములో తన యాత్మను ప్రవేశ పెట్టుట ), వాక్సిద్ది (తానేమి పలికిన అది తప్పక జరుగుట ) ,కల్ప వృక్షత్వము (భక్తులు కోరినవి యియ్యగల శక్తి ), సృష్టి సంహారములలో స్వాతంత్ర్యము ,అమరత్వము (చావు లేకుండుట ), సర్వాగ్ర్యము (అందరిలోనూ శ్రేష్టత్వము ) అను అష్టాదశ
No comments:
Post a Comment