ఆరవ
పండితుడు:-
మహారాజా శుక్రుడే బహుమంచివాడు, రాక్షసులకు నుపకార మొనరించినవాడు.
మరణించిన తన భక్తులను
సంజీవిని మంత్రమువలన పునర్జీవితుల గావించిన మహానుభావుడు.
ఆయన కోపించిన త్రిలోకవాసులు భయపడెదరు.
ఆయన శక్తి సామర్ధ్యములను వర్ణింప బ్రహ్మదేవునికైనా నలవికాదు.
సర్వదుష్కర్మలను
చూర్ణము గావించును.
ఆయనను దలచినంత మాత్రమున సర్వవిఘ్నములు దూరమగును.
శుక్రునెవరు
పూజింతురో వారికి శక్తి
సామర్ధ్యములు ప్రాప్తమగును.
అధివ్యాధులు, దుఃఖ దారిద్ర్యములు తొలగిపోవును.
ఆయనను
ఆరాధించినవారికి వారి సర్వాభీష్టములు నెరవేరును.
కావున అందరిలో శుక్రుడే శ్రేష్టుడు అని
పలికెను.
అందులకు రాజు పండితులారా, మీరన్నాది నిజమే కాని అందరు
శ్రేష్టులే అయిన ఇందులో నెవరిని
పూజించవలెను.
అని మరల
ప్రశ్నించెను. అంత నింకొక పండితుడు లేచి
నిలువంబడి ఇటుల పలుకచుండును.
ఏడవపండితుడు:-
భూమీశ్వరా! రాహుకేతువులనువారందిరిలో
శ్రేష్ఠులు. వారి చర్యలు మహాద్భుతములు.
వీరిరువురు రాక్షసజాతికి
జెందినవారు.
వారిని జూచినంత మాత్రమున సూర్య చంద్రులు గడ గడ వణుకుచుందురు.
రాహువు చంద్రుని, కేతువు
సూర్యుని పీడించు చుందురు.
అట్టి సమయమున గ్రహణమని యందురు.
ఇది మనకందరకు ప్రత్యక్షముగా కనబడుచుండును.
ప్రాణిమాత్రులకు
వారిని పూజించుటచే సర్వపీడలు నివారణ మగుచుండును.
వారిరువురి
చర్యలొక్కటే. సర్వగ్రహములకంటే వీరతిక్రూరులు, జనులను మిక్కిలిగా
పీడించుచుందురు.
కావున ప్రతిదినము రాహుకేతువులను పూజించుచుండ వలెను,
అని పల్కినవిని యింకొక పండితుడు
ముందుకు వచ్చి పలుకసాగెను.
ఎనిమిదవ
పండితుడు:-
రాజాధిరాజా! సహాసాంకా! నే జెప్పునది
సావధానముగా వినుడు.
అందరిలో శనైశ్చరుడే శ్రేష్టుడు మరియు నద్భుత బలాడ్యుడు,
ఆయన కళ ఎంతవాని కైనను తెలియలేదు.
ఆయన కృప ఎవరి యందుండునో
వారిని
No comments:
Post a Comment