Wednesday, March 5, 2014

వైద్య జ్యోతిషం1




మానవుని జీవితంలో రుగ్మతలు సర్వ సాధారణం .
ఆ రుగ్మతలకు కూడా రాశులు ,
వాటి అధిపతులైన గ్రహాలూ కారణం అవుతాయి.
రాసి తత్వాలు ,గ్రహకార కత్వాల ద్వారా
రోగ నిర్ధారణకు ఉపకరించేదే వైద్య జ్యోతిషం .
 ఏ శరెర భాగాలకు రుగ్మతలు వస్తాయో రాశులు తెలుపుతాయి.
ఎటువంటి రుగ్మతలు వస్తాయో గ్రహాల ద్వారా తెలుస్తుంది .
ముందుగా రాశులు - వాటికి వర్తించే శరీర
భాగాలు ఈ దిగువన వివరిస్తున్నాం.

రాశులు - శరీర భాగాలు
మేషం - శిరస్సు ,ముఖం, మెదడు , ముఖంలోని ఎముకలు,
మెదడు లోని నరాలు.
వృషభం - గొంతు, మెడ, వాటిలోని నరాలు,ఎముకలు.
మిధునం - భుజాలు, చేతులు, వాటిలోని ఎముకలు, నరాలు,
 శ్వాస కోశం .
కర్కాటకం- రొమ్ము ,జీర్ణాశయం.
సింహం - గుండె , వెన్నెముక
కన్య - ఉదరం, ఉదరకోశం,పొత్తికడుపు
తుల - కటి భాగం, నాభి, మూత్ర పిండాలు.
వృశ్చికం - జననేంద్రియాలు, మూత్రకోశం .
ధనుస్సు - తొడలు, పిరుదులు, రక్త నాళాలు.
మకరం - మోకాళ్ళు, కీళ్ళు.
కుంభం - పిక్కలు, కాళ్ళు, రక్త ప్రసరణం.
మీనం - పాదాలు, వేళ్ళు, శరీరంలోని ద్రవ పదార్దాలు.
ఈ రాశులలో మేష, సింహ, ధనుస్సులు అగ్నితత్వానికి,
వృషభ, కన్య, మకరాలు భూతత్వానికి, మిధున , తుల,
కుంభ రాశులు వాయు తత్వానికి , కర్కాటక, వృశ్చిక,
మీన రాశులు జల తత్వానికి చెందినవి.
 కావున ఈ తత్వానికి సంబందించిన రుగ్మతలు
 కూడా వచ్చే అవకాశం ఉంది.
వీటితో పాటు గ్రహాలు కూడా కొన్ని రుగ్మతలకు కారణం అవుతాయి .
 గ్రహాలు ఆ కలుగ చేసే రుగ్మతల వివరాలు ఈ క్రింద పొందు పరచినాము.

No comments:

Post a Comment