అన్ని విధముల సంరక్షించుచుండును. ఆయన
గ్రహదిక్పాలకులందరి యందుండును.
ఎవరి యందయితే ఆయనకు కోపమువచ్చునో
వారికి నానా విఘ్నములు కలుగునని తెలియవలెను.
వారి సంసారము చెడిపోయిన దన్నమాటే, శనిదేవుడు మహాక్రోధము గలవాడు.
ఆయనను పూజించని
వారి కపజయమే సిద్ధించును.
ఆయన మహాదుఃఖదాయకుడు. శనైశ్చరుడు
నల్లని దేహము కలవాడు.
కులమున శూద్రుడు పాదముల కంటి, మంచి స్వరూపము కలవాడు.
పూజించిన
ఆయననే పూజించవలెను.
ఎవరి యందాయన కోపద్రుష్టి ప్రసరించునో వారిని
సర్వనాశనము మొనరించును.
కృపాదృష్టి నిండినవారి యానందమునకు మేర
లేకుండును.
ఆయన దృష్టి యొక్క చమత్కార మెటువంటి దనిన
శనైశ్చరుడు జనించినప్పుడు ఆయన దృష్టి తన
తండ్రియగు సూర్యునిపైబడెను.
తక్షణమే సూర్యుని దేహమెల్ల రంధ్రములతో నిండిపోయెను.
ఆయ రథసారథి కుంటివాడయ్యెను. గుర్రములు గ్రుడ్డివాయెను.
ఎప్పుడాయన దృష్టి
అణుమాత్రము వారినుండి మరలెనో ఆప్పుడువారు మంచివారైరి.
అనిన యాపండితుడు
డాడుమాటలను విన్నంతలో విక్రమార్క మహారాజు నవ్వి ఇట్లనెను.
అట్టి
అపవిత్రుడగు పుత్రుడు బుట్టి తండ్రి కి యేమి ప్రయోజనము? వాడు పుత్రుడు కాడు, శత్రువు.
పుట్టగానే అంతపని
జేసినవాడు, పెరిగిన
వెలకనేమి జేయకుండును?
పండితులారా
మీరే చెప్పుడు.
అని శనైశ్చరు నెన్నో విధముల తూలయాడెను.
అట్టి సమయమునందే శనిదేవుడు విమానారూడుడై
పోవుచుండి రాజుమాట చెవిని
బాడినంతనే తక్షణము విమానము నుండి దిగి
వచ్చెను.
అకస్మాత్తుగా రాజసభలోకి వచ్చి కూర్చుండెను.
అది గని
పండితులెల్లరు శనిదేవుడు ప్రత్యక్షమయ్యెనని గోలజేయ మొదలుపెట్టిరి.
అంత విక్రమార్కుడు
వెంటనే సింహాసనము నుండి దిగివచ్చి శనైశ్చరుని, పాదంబులకు
తన శిరమువంటి
మ్రొక్కబోయెను.
శనైశ్చరుడా రాజును కోపద్రుష్టితో చురచురం జూచుచు
రాజా నీకింత మదమా?
నన్ను
నిందజేయుదువా? సరే నా చమత్కార మిను క్షణమాత్రములో
చూపించెదను చూడుము.
నీ గర్వమును పరిహారమొనర్చుటకై కన్యారాశి యందు
ప్రవేశించుచున్నానని విమానారూడుడై వెడలిపోయెను.
అంత మహారాజు
భిన్నవదనుడై పండితులను జూచి ఈ విధముగా పలికెను.
పండితులారా ఇప్పుడేమి చేయవలెను? నే నూరకుండక శనిదేవుని అపహాస్య
మొనరించితిని.
ఆయన కోపమిను
కెపడోపును? నన్ను కష్ట
పెట్టక మానడు, ఏది యెట్లు
గానున్నాడో అట్లగును.
నా నుదుట నెట్టలు వ్రాసియున్నదో కదా!
అని విక్రమార్క మహారాజు చింతాక్రాంతుడై సభనుండి
అంతఃపురమునకు వెడలిపోయెను.
సంధ్యా స్నానమాచరించి భోజనముచేసి మంచముపై శయనించెను.
అంత ఒక నెల
No comments:
Post a Comment